Take a fresh look at your lifestyle.

అపర చాణక్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, మన పివి

1985‌లో రాజీవ్‌ ‌గాంధీ కేబినెట్లో పీవీ నరసింహారావు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు జాతీయ విద్యా విధానం 1986 ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌బోర్డ్ ‌పథకాల రూపశిల్పి ఆయనే 33 శాతం పాఠశాలలకు ఒకే టీచర్‌ ఉన్నాడని అందువల్ల సింగిల్‌ ‌టీజర్‌ ‌పాఠశాలలన్నీ డబుల్‌ ‌టీచర్‌ ‌పాఠశాలలు గా మార్చారు ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయ స్థాపించి నాణ్యమైన విద్య విధానానికి శ్రీకారం చుట్టారు 1991  జూన్‌ 21‌న జరిగిన ఎన్నికల్లో భారత దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు సభ్యుడు కాకుండా పీవీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం భారత దేశ చరిత్రలోనే నూతన ఒరవడిని సృష్టించింది. పీవీ నరసింహారావు మన్మోహన్‌ ‌సింగ్‌ ‌లు   రాజకీయ చాతుర్యం ఆర్థిక పరిజ్ఞానంతో భారతదేశాన్ని ఆర్థిక రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకొని వచ్చాడు.

‘ఇండియా వెలిగి పోతుందని  ఎవరైనా అంటే తప్పు లేదు. అయితే నా వల్లే వెలిగి పోతుందంటే తప్పు. నేను ఒక రైతుకు  వానలు బాగా కురిసి పంటలు పండితే నేను సంతోషిస్త వెలిగి పోతా. వాన నేను తెచ్చాను అని ఎవరైనా అంటే ఒప్పుకోను’’ అని తెలిపిన మహానీయుడు ,  సంస్కరణల రథసారధి, బహు భాషా కోవిధుడు, తొలి దక్షిణ భారత ప్రధాన మంత్రి, దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి భేష్‌ అనిపించుకున్నాడు. మైనారిటీ ప్రభుత్వాన్ని మెజార్టీ ప్రభుత్వం గా తీర్చిదిద్దిన విధానం, అతడు దూరదృష్టి, వాక్చాతుర్యం, సంగీతం, పటనం, రచన, నాటకాలు, ఆయన అభిరుచులు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి విజయం సాధించి చరిత్రలో నిలిచిన మహనీయుడు. తెలంగాణ రాష్ట్రం నుంచి భారత ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిరోహించిన తెలంగాణ ముద్దుబిడ్డ. పాములపర్తి వెంకట నరసింహారావు 18 భాషల్లో అనర్గళంగా సంభాషణ చేసే బహు భాషా కోవిదుడు. ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోలో పాములపర్తి రుక్కబాయమ్మ, సీతారామారావు, అనే పుణ్య దంపతులకు రెండవ సంతానంగా పీవీ నరసింహారావు జన్మించారు. తెలంగాణ బిడ్డగా పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించారు. నాలుగు సంవత్సరాల పిన్న వయసులోనే భారత భాగవత, రామాయణాలు, లోని శతకాలను శ్లోకాలను, పద్యాలను, ఒకసారి చదివి అప్పజెప్పే ఏకసంతాగ్రహి.వంగర,వేలూరు గ్రామాల్లో రెండవ తరగతి హుజురాబాద్‌ ‌జెడ్‌ ‌పి హైస్కూల్‌ ‌లో పదవ తరగతి వరకు చదివి ఉన్నత విద్య కోసం ఓరుగల్లు నగరానికి వెళ్లారు. కన్‌ ‌తండ్రి సీతారామారావు అన్నగారైన రంగారావు రత్నబాయమ్మకు  పిల్లలు లేనందున వారు పీవీని దత్త పుత్రునిగా చేసుకొని అల్లారుముద్దుగా పెంచారు. పివీ చదువుకునే రోజుల్లో అన్నింటిలోనూ ఆయనే ముందుండేవారు. పీవీ నరసింహారావు గారి బాల్య వివాహం 10 సంవత్సరాల పిన్న వయసులోనే కుటుంబ పెద్దలు ఆయనకు పెళ్లి చేయాలని నిర్ణయించి దగ్గరి బంధువుల కుమార్తె సత్యమ్మతో  పీవీ కల్యాణం కరీంనగర్‌ ‌జిల్లా ఇల్లందకుంట శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో 1931 లో జరిగింది అత్తగారిల్లు ఇల్లందకుంట మండలం సిరిసేడు  గ్రామం కావడంతో ఇరు వర్గాల పెద్దలు ఇల్లందకుంట దేవస్థానంలో కన్నుల పండుగగా వివాహాన్ని జరిపించారు.

సంగీతం పటణం,రచనలు, సినిమాలు, నాటకాలలో, ఆయనకు ప్రత్యేక అభిరుచి. చంద్రుని గురించి ‘జయచంద్ర హైందవ ధ్వంసక’’ అనే మకుటంతో కవిత రాశారు. ‘ఎదవ నాగన్న’’ అనే కథలను రాసి పేరు కీర్తి సంపాదించారు. ఇతర భాషల్లోకి తర్జుమా చేశారు షేక్స్పియర్‌ ‌డ్రామాలో ను తెలుగులోకి కథ సంగ్రహాలుగా రాశారు. విశ్వనాధ సత్య నారాయణ రాసిన రామాయణ కల్పవృక్షాన్ని వేయిపడగలు పేరుతో హిందీ లోకి అనువాదం చేశారు. ఇంగ్లీషులో వెలువడిన ఇన్సైడర్‌ అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది. దేశంలోని పుస్తక ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది. 1956లో ఆంధ్ర ప్రదేశ్‌ ‌పిసిసి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 1962 లో లో జరిగిన చైనా యుద్ధం బాధితుల కోసం రక్షణ శాఖ నిధికి అత్యధిక విరాళాలు సేకరించారు 1956లో భాషా ప్రయుక్త ఏర్పాటులో  భాగంగా గా కలిపి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం ఏర్పడింది 1957 1962 1967 1972 లలో నాలుగు సార్లు విజయం సాధించి మంథని నియోజకవర్గం పేరును దశదిశలా చాటారు. 1958 నుండి 1960 వరకు అధికార భాష సంఘం సభ్యునిగా పనిచేశారు. 1962లో న్యాయశాఖ జైళ్ల శాఖ మంత్రిగా పనిచేసి ఆ శాఖకు వన్నె తెచ్చారు. జైలులో లైబ్రరీలను నెలకొల్పి ఆటపాటలతో ఖైదీలలో పరివర్తన వచ్చేటట్లు పలు చర్యలు చేపట్టారు. 1964లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి  మద్రాస్‌ ‌రిలీజియన్‌ ఎం‌డోమెంట్‌ ‌చట్టాన్ని తెలంగాణ ప్రాంతంలోని రెగ్యులేషన్‌ ‌చట్టం తో సమన్వయపరిచి కొత్త చట్టాల రూపకల్పన చేశారు. 1965లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసి పలు సంస్కరణలు చేపట్టారు. 1967లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి తెలుగు అకాడమిని స్థాపించారు. తెలుగు భాషకు అధికార భాషగా పునాదులు వేసిన ఘనత నరసింహా రావు కే దక్కుతుంది .డిటెన్షన్‌ ‌విధానాన్ని రద్దు చేసి ఏడవ తరగతి వరకు కామన్‌ ‌పరీక్షలను ప్రవేశపెట్టాడు. స్థాయి నుంచి డిగ్రీ వరకు తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టి అమలు చేశారు మార్కులు ముఖ్యం కాదని తెలివి కోసమే విద్య నేర్చుకోవాలని సూత్రాన్ని ఆయన అమలు చేశారు 71 లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ చేతిలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఘోరంగా దెబ్బ అ తిన్నది ఏ వర్గం లేని ఎవరికి కొమ్ము కాయని గ్రూపులు నిర్వహించని వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని ఇందిరాగాంధీ తలచి పీవీ కి ముఖ్యమైన పీఠాన్ని సెప్టెంబర్‌ 28 1971‌లో అప్పగించారు ఆ పదవిలో ఆయనకు ఎన్నో గొప్ప పనులను చేపట్టి పలువురు ముఖ్యమంత్రులకు ఆదర్శనీయుడు అయ్యాడు 1972లో పివి నాయకత్వాన అసెంబ్లీకి ఎన్నికలు జరగగా 229 సీట్లతో కాంగ్రెస్‌ ‌పార్టీ అఖండ విజయం సాధించి రెండవ సారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని నినాదం బలపడడంతో అధిష్టానం ఆదేశాల మేరకు 1973 జనవరి 17న తన పదవికి రాజీనామా చేశారు.

1985లో రాజీవ్‌ ‌గాంధీ కేబినెట్లో పీవీ నరసింహారావు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు జాతీయ విద్యా విధానం 1986 ఆపరేషన్‌ ‌బ్లాక్‌ ‌బోర్డ్ ‌పథకాల రూపశిల్పి ఆయనే 33 శాతం పాఠశాలలకు ఒకే టీచర్‌ ఉన్నాడని అందువల్ల సింగిల్‌ ‌టీజర్‌ ‌పాఠశాలలన్నీ డబుల్‌ ‌టీచర్‌ ‌పాఠశాలలు గా మార్చారు ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయ స్థాపించి నాణ్యమైన విద్య విధానానికి శ్రీకారం చుట్టారు 1991  జూన్‌ 21‌న జరిగిన ఎన్నికల్లో భారత దేశ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు సభ్యుడు కాకుండా పీవీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం భారత దేశ చరిత్రలోనే నూతన ఒరవడిని సృష్టించింది. పీవీ నరసింహారావు మన్మోహన్‌ ‌సింగ్‌ ‌లు   రాజకీయ చాతుర్యం ఆర్థిక పరిజ్ఞానంతో భారతదేశాన్ని ఆర్థిక రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకొని వచ్చాడు. జవహర్లాల్‌ ‌నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ ‌గాంధీ, అంబేద్కర్‌, ‌మొరార్జీ దేశాయి, శాస్త్రి, వంటి వారికి భారతరత్న ఇచ్చారు. కానీ సంస్కరణల రూపశిల్పి పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ, ఫ్రెంచ్‌, ‌స్పానిష్‌, అరబిక్‌, ‌పార్సీ, హిందీ, సంస్కృతం, కన్నడం, మరాఠీ, భాషల్లో ఆయన దిట్ట 1977 లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేశారు. 2004లో స్థిత ప్రజ్ఞ బిరుదును పొందారు. 2004 డిసెంబర్‌ 23‌న ఉదయం 11 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. విధిలేని పరిస్థితులలో ఆర్థిక రంగంలో సంస్కరణలు చేపట్టి విజయవంతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అపారమైన అనుభవం ఉన్న ఆయనకు ఏ పార్టీలో శత్రువులు గాని వర్గము గాని లేదు. దేశంలో ఎందరో రాజకీయ నాయకులకు వచ్చిన గుర్తింపు  పివీ కి రాకపోవడం దురదృష్టకరం. అని ఆయన పార్టీ వారి కంటే పరాయి పార్టీల వారు ఎక్కువ గౌరవం చూపుతారు. తెలుగు వారికి గర్వకారణం పీవీ నరసింహారావు గారు .ఆయన తెలుగు వారికి ఒక రోల్‌ ‌మోడల్‌ ‌రాజకీయ నాయకులకు ఒక దిక్సూచి నిస్వార్ధపరుడు నిగర్వి సాహితీవేత్త బహు భాషా కోవిదుడు అయినా టీవీ కి ప్రతి ఒక్కరు జోహార్లు అర్పిద్దాం.

ravula rajesam
రావుల రాజేశం, లెక్చరర్‌
‌బి.ఈ.డి కాలేజి, 7780185674

Leave a Reply