Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఏపీ ఆర్టీసీ మధ్య తెగని పంచాయితీ

  • హైదరాబాద్‌ ‌విజయవాడ రూట్‌ ‌పైనే వివాదం
  • నేడు మరోమారు కీలక చర్చలు

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణ అంశంపై నెలకొన్న అనిశ్చితి వీడటం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలన్నింటినీ అంగీకరించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వడం లేదని ఏపీ ఆర్టీసీ అధికారులు అంటుండగా, తాము సూచించిన సవరణలకు ఏపీ ప్రభుత్వం ఓకే చెబితేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణ అంశంలో హైదరాబాద్‌ ‌విజయవాడ రూట్‌పైనే వివాదం నెలకొంది. ఏపీ, తెలంగాణ అంతరాష్ట్ర సర్వీసుల్లో ఈ రూటే కీలకం. రెండు రాష్ట్రాల నుంచి ఈ రూట్లోనే ఎక్కువ బస్సులు నడుస్తుంటాయి. ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కావాలంటే ఏపీ ఆర్టీసీ ఈ రూట్‌లో ప్రస్తుతం నడిపిస్తున్న బస్సుల సంఖ్యను తగ్గించేలా ప్రధాన డిమాండ్‌ను ఏపీ ప్రభుత్వం ముందు ఉంచాలని సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

ఇందులో భాగంగానే ఈనెల 23న ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. అయితే, తెలంగాణ డిమాండ్‌ ‌మేరకు కిలోమీటర్లను తగ్గించడంతో పాటు రూట్లను ఖరారు చేశామనీ, అయినప్పటికీ తెలంగాణ ఆర్టీసీ అధికారులు మరిన్ని సవరణలు చేయాలని చెప్పడంతో చర్చలలో ప్రతిష్టంబన కొనసాగుతోందని ఏపీ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. దసరా పండుగ సమయంలోనూ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కనీసం 200 బస్సులను అత్యవసరంగా తిప్పేందుకు అనుమతించాలని ఏపీ ఆర్టీసీ అధికారులు చేసిన విజ్ఞప్తిని సైతం తెలంగాణ ఆర్టీసీ అధికారులు తిరస్కరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply