Take a fresh look at your lifestyle.

ఎపి సర్కార్‌ ‌మరో కీలక నిర్ణయం

అమరావతి,మే 9 : మద్య నియంత్రణ, నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తంగా 33శాతం వైన్‌ ‌షాపులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యం దుకాణాల సంఖ్య 2934కు తగ్గనుంది.  గతంలోనే 40శాతం బార్లు, 20శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం తాజాగా మరో 13శాతం వైన్స్ ‌షాపులను రద్దు చేసింది. ఈనెలఖరు వరకు దుకాణాలు తీసివేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల గతంలోనే  4380 మద్యం షాపులను 3500లకు తగ్గించిన విషయం తెలిసిందే.తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం ఇప్పటికే 20శాతం తగ్గించింది. లిక్కర్‌ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపింది.

Leave a Reply

error: Content is protected !!