Take a fresh look at your lifestyle.

చంద్రబాబు కాదు..స్టేల బాబు .. కోర్టు కేసులు ఎదుర్కో లేని పిరికి వ్యక్తి : నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ అత్యంత పిరికి వ్యక్తి, విచారణలు ఎదుర్కోలేని చవట దద్దమ్మగా ఈ భారత దేశంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే నారా చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు. ఆయనను చంద్రబాబునాయుడు అనే పేరు కంటే స్టేల బాబు అని పిలిస్తే బావుంటుందని ఎద్దేవా చేశారు. సీఐడీ విచారణలో దొరుకిపోతాననే భయంతోనే, స్టేల బాబు మళ్ళీ కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారన్నారు.

చంద్రబాబుకు ఉన్న మేనేజ్మెంట్‌, ‌పలుకుబడిని ఉపయోగించుకునే కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి పెద్దపెద్ద సుప్రీం కోర్టు లాయర్లను తెచ్చుకుంటున్నారన్నారు. కోర్టుల ద్వారా చంద్రబాబు తాత్కాలికంగా స్టేలు తెచ్చుకున్న ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఇప్పటికే చంద్రబాబుకు ప్రజలు అనేకసార్లు బుద్ధి చెప్పారని.. రాబోవు జిల్లా పరిషత్‌, ‌మండల పరిషత్‌ ఎన్నికలు, తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు వేసే శిక్షతో చంద్రబాబు రోడ్డు వి•దకు రాకుండా ఇంటికి పరిమితం చేస్తారని తెలిపారు. అతి భయంకరమైన శిక్షను చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

Leave a Reply