- వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఎపి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫలితాలు వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయన్నారు. బోర్డు వెబ్సైట్లో హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం 5,07,228 మంది, రెండో సంవత్సరం 4,88,795 మంది, ఒకేషనల్ మొదటి సంవత్సరం 39,139 మంది, రెండో సంవత్సరం 29,993 మంది మొత్తం 10,65,155 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇంటర్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరం ఫలితాల్లో స్జబెక్టుల వారీగా మార్కులు, రెండో సంవత్సరం ఫలితాలు స్జబెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లలో ప్రకటించనున్నారు. ఇక ఫలితాల షార్ట్ మార్కుల మెమోలు ఈనెల 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాక్డౌన్ సడలింపుల తర్వాత పరీక్ష ఫలితాలు వెల్లడిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం.