Take a fresh look at your lifestyle.

ఎపిలో కక్షసాధింపు చర్యలు

  • జువారి, అమర్‌ ‌రాజాల వ్యవహారంలో చుక్కెదురు
  • సంగం డెయిరీ విషయంలోనూ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టుు

విజయవాడ,  : కరోనా కేసుల విజృంభణ, మరణాలు ఓ వపు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ఎపిలో పాలక వైకాపా విపక్ష నేతలపై కేసులతో చెలగాటమాడుతోంది. చంద్రబాబు సహా పార్టీలో నేతంలందరిపైనా ఏదో ఓ కేసును పెడుతున్నారు. ఓ అనమాకుడు ఇచ్చిన ఫిర్యాదుతో టిడిపి అధినేత చంద్రబాబుపైనా క్రిమనల్‌ ‌కేసు నమోదు చేశారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావ్‌, ‌కొల్లు రవీంద్ర తదితరులపై కేసులు పెట్టారు. సంగం డెయిరీ విషయంలో ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ ‌చేసి జైలులో పడేశారు. కరోనా వేళ కేసులు పెట్టడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురి చేయడమా లేక చంద్రబాబు సమా అందరినీ జైలులో తోయడమా అన్నది అర్థం కావడం లేదు.

సంగం డెయిరీపై దశాబ్దం కింద నమోదైన కేసును తిరగదోడి ధూళిపాళ్ల నరేంద్రను ఇప్పుడు అరెస్టు చేయడాన్ని బట్టి జగన్‌ ‌రెడ్డి ప్రాధాన్యతలు ఏమిటో తెలిసింది. నరేంద్రకు ఇప్పుడు జైల్లో కరోనా కూడా సోకినందున కుటుంబ సభ్యులు ఆందోళన చెందినా పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా నడుస్తూ పేరొందిన జువారీ సిమెంట్స్, అమర్‌ ‌రాజా బ్యాటరీస్‌ ‌వంటి సంస్థలను కాలుష్య నియంత్రణ మండలిని అడ్డంపెట్టుకొని మూసివేయాలని ఆదేశించడం ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు పరాకాష్ఠ కాక మరోటి కాదు. రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న కంపెనీలలో అమర్‌ ‌రాజా బ్యాటరీస్‌ ఒకటి. ఎన్టీఆర్‌ ‌ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో ఉంటున్న గల్లా రామచంద్ర నాయుడిని ఒప్పించి రాష్ట్రానికి రప్పించి ఆ సంస్థను నెలకొల్పేలా ప్రోత్సహించారు.

వేలాదిమందికి ఉపాధి కల్పించే సంస్థకు రాత్రికి రాత్రే కరెంటు కట్‌ ‌చేయడాన్ని మించిన దారుణం ఏముంటుంది.  కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను కూడా రాజకీయ కక్షతో మూసివేయిస్తున్న  ప్రభుత్వ తీరును ప్రజలు హర్షించడం లేదు. జువారీ, అమర్‌ ‌రాజా విషయంలో ప్రభుత్వ ఆదేశాలను సస్పెండ్‌ ‌చేసిన విధంగానే సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ జారీ చేసిన జీవోను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారాలను చూస్తుంటే  ప్రభుత్వ అధికారులు ఎంత అసంబద్ధంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టకపోతే నష్టపోయేది అంతి మంగా సిఎం జగనే అని గుర్తించాలి. ఇదిలావుంటే కరోనా వైరస్‌ ‌తీవ్రతను గురించి ప్రజలకు వివరించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చిన చంద్రబాబునాయుడుపై నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసులు నమోదు చేయడాన్ని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు.

ఒక ఎమ్మెల్యే గౌరవానికి భంగం వాటిల్లిందన్న నెపంతో లోకేష్‌బాబు ద ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేయించిందని విమర్శిం చారు. ఈ చర్యలు ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్టగా నిలుస్తా యన్నారు. ప్రతిపక్ష నేత, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై  ఓ మంత్రి నోరు పారేసుకుంటుంటే ఆ సీఎం, పోలీసులు ఎందుకు కేసులు నమోదు  చేయడం లేదని ప్రశ్నించారు.

Leave a Reply