ఘనంగా స్వాగతించిన జిల్లా అధికారులు
తిరుపతి, ఏప్రిల్ 28 : రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ఏడవ కాన్వోకేషన్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ వారికి ఘన స్వాగతం లభించింది.వీరి వెంట గవర్నర్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్ల్సర్ సదాశివమూర్తి తదితరులు, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సిరాజ్ భాషా ఘన స్వాగతం పలికారు. వీరితో పాటుగా లైజన్ ఆఫీసర్ చెన్నయ్య, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు, ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్, తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయం నుండి శ్రీ పద్మావతి అతిథి గృహం తిరుపతికి చేరుకున్న గౌరవ ఆంధప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ, టీటీడీ సివీ ఎస్వో నరసింహ కిషోర్ వారు సాదర స్వాగతం పలికారు.