Take a fresh look at your lifestyle.

ఏపీ ప్రభుత్వ జల దోపిడీని అరికట్టాలి

రామన్నపేట, మే16 (ప్రజాతంత్ర విలేకరి) పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం, 203 జీవో జారీ చేసినా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న అసమర్థ కెసిఆర్‌ ‌సర్కారుకు వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌పిలుపు మేరకు ఇంటిపై నల్ల జెండా ఎగరవేసి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని బిజెపి జిల్లా కార్యదర్శి, పిఏసిటఎస్‌ ‌డైరెక్టర్‌ ‌కన్నెకంటి వెంకటేశ్వరచారి అన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సాగు, తాగునీరు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం బ్రజేష్‌ ‌కమిటీ నీటి పంపకాలను తుంగలో తొక్కి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌ ‌నుండి అక్రమంగా 10 టీఎంసీల నీటిని తరలించే జీవో 203ను వెనక్కు తీసుకుని, తెలంగాణ ప్రజలను రైతులను ఆదుకోవాలని, కెసిఆర్‌ ‌ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చొరవ చూపి ఆంధ్రప్రదేశ్‌ ‌జల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళితమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము యాదయ్య, ఓబిసిసెల్‌ ‌జిల్లా కార్యదర్శి కట్కూరి భిక్షపతి, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు యాదాసు లక్ష్మణ్‌, ‌బిజెపి నాయకులు  సిద్ధం లింగయ్య,  ఏలూరి రవి, చిన్నపాక స్వామి, బేతు శ్రీనివాసులు, బైరబోయిన రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటలో…
సూర్యాపేట, మే 16, ప్రజాతంత్ర ప్రతినిధి): పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యము పెంపుకు, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 203తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎం‌దుకు నోరు మెదపడంలేదని బిజెపి పంచాయతీ రాజ్‌ ‌సెల్‌ అధ్యక్షులు చలమల్ల నర్సింహా అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్‌ ‌సభ్యులు బండి సంజయ్‌ ‌పిలుపుమేరకు కేసీఆర్‌ ‌తీరుకు శనివారం నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. తెలంగాణ రైతులకు రాష్ట్రం ఏర్పడకముందు, ఏర్పడిన తరువాత నీటి సమస్యలు తప్పలేదని గుర్తుచేశారు. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఈ మేరకు తన ఇంటిపైన నల్ల జెండా ఎగురవేసి నిరసన వ్యక్తం చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించాలని అన్నారు.

Leave a Reply