Take a fresh look at your lifestyle.

వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగవంతం

గ్లోబల్‌ ‌టెండర్లకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం
అమరావతి : వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కోసం ఏపీ ప్రభుత్వం గ్లోబల్‌ ‌టెండర్లకు ఆహ్వానం పలికింది. కోటి మందికి వ్యాక్సిన్‌ ‌వేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించింది. జూన్‌ 3 ‌వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు టెండర్ల డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ ‌చేయాలని ప్రభుత్వం సూచించింది. టెండర్ల టెక్నికల్‌ ‌బిడ్‌ను అదే రోజు సాయంత్రం 5 గంటలకు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 20 న సాయంత్రం 5 గంటలకు ఫ్రీ బిడ్‌ ‌టింగ్‌ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు ఏపీఎంఎస్‌ఐడీసీ పేరిట ఈఎండీ కింద 3 లక్షల రూపాయల డీడీ తీయాలని ప్రభుత్వం సూచించింది.

కోటి మందికి వ్యాక్సినేషన్‌ ‌చేయాలని టెండర్లలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుంటే గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 96,446 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,399 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,66,785 మందికి కరోనా వైరస్‌ ‌సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 89 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,077కు చేరింది. గడిచిన 24 గంటల్లో 18,638 మంది కోవిడ్‌ ‌నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 11 లక్షల 56 వేల 666 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ ‌బులెటిన్‌ ‌విడుదల చేసింది.

ఏపీలో ప్రస్తుతం 2,01,042 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,77,02,133 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో గురువారం సక్ష నిర్వహించారు. దీనికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా కేబినెట్‌ ‌సబ్‌కమిటీ నివేదిక, ఆక్సిజన్‌ ‌సరఫరా, వ్యాక్సినేషన్‌పై చర్చలు జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ ‌టెండర్లను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. 3 వారాల్లోగా కంపెనీలు తమ ఆసక్తిని తెలపాలని ప్రభుత్వం కోరింది.

Leave a Reply