Take a fresh look at your lifestyle.

ఎపి సిఎస్‌ ‌నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు

మరో మూడు నెలల పొడిగిస్తూ కేంద్రం ఆమోదం

అమరావతి,జూన్‌ 3 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్‌ ‌పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. కరోనా నేపథ్యంలో సీఎస్‌ ‌విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 ‌వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ సీఎస్‌ ‌సర్వీస్‌లో కొనసాగనున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు విషయంలో కేంద్రం జగన్‌ ‌సర్కార్‌ ‌ప్రతిపాదనకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. నీలం సాహ్ని పదవీకాలాన్ని కేంద్రం మరో 3 నెలలు పొడిగించింది. కొద్దిరోజుల క్రితం ఈ అంశంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చేసుకున్న విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించింది.

కొద్దిరోజుల క్రితం చీఫ్‌ ‌సెక్రటరీ పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం జగన్‌ ‌ప్రధాని మోదీకి లేఖ రాశారు. జూన్‌ ‌నెలాఖరుతో సీఎస్‌ ‌నీలం సాహ్ని పదవీకాలం ముగుస్తుంది. అయితే, మరో ఆరు నెలల పాటు ఆమె పదవీకాలాన్ని పొడిగించాలంటూ సీఎం జగన్‌ ‌ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త చీఫ్‌ ‌సెక్రటరీని నియమించేకంటే ప్రస్తుతం ఉన్న సీఎస్‌ ‌నీలం సాహ్నినే కొనసాగించాలని సీఎం జగన్‌ ‌కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు చీఫ్‌ ‌సెక్రటరీల పదవీకాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఏపీలో సీఎస్‌ ‌రమాకాంత్‌ ‌రెడ్డి పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించింది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పీకే మహంతీ పదవీకాలాన్ని నాలుగు నెలల పాటు పొడిగించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!