Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో రైతు ఉద్యమానికి కాంగ్రెస్‌ ‌మద్దతు

జగన్‌కు మోడీ భయం పట్టుకుంది: శైలజానాథ్‌  
‌సీఎం జగన్‌ ‌కేసుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమన్నా చేస్తారేమోనని భయం పట్టుకుందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్‌ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. రైతులకు మద్దతుగా, రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌కిసాన్‌ ‌సమ్మేళన్‌ అన్నారు. కష్టాన్ని కష్టం అని చెప్పుకోలేని దుర్మార్గమైన కాలంలో ఉన్నామన్నారు.

దేశంలో రైతుల పక్షాన ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు కాంగ్రెస్‌ ‌పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. రైతుల పక్షాన ఒక్క కాంగ్రెస్‌ ‌తప్ప ఎవరూ మాట్లాడటం లేదన్నారు. రైతులకు వ్యతిరేకంగా వైసీపీ, తెలుగుదేశం ఎంపీలు ఓటువేశారని చెప్పారు. కనీస మద్దతు ధర అనేది పుట్టింది కాంగ్రెస్‌తోనే అన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే ఏం నష్టం అని జగన్మోహన్‌రెడ్డి మాట్లాడడం దారుణమన్నారు. ఉచిత విద్యుత్‌ అనేది కాంగ్రెస్‌ ‌పెట్టిన పథకం అన్నారు.

రాజశేఖర్‌రెడ్డి పేరెత్తే అర్హత జగన్‌కు లేదన్నారు.బీజేపీ బినామీ  ప్రభుత్వం రాష్ట్రంలో సాగుతోందన్నారు. సీఎం కుర్చీ ఉంటే చాలు జగన్‌ ఎక్కడైనా సంతకం పెడతారని ఎద్దేవా చేశారు.
కేంద్రం తీసుకొచ్చే మైనార్టీ, రైతు వ్యతిరేక చట్టాలకు జగన్‌ ‌సంతకాలు పెడతారని ఎద్దేవా చేశారు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. విశాఖ ఉక్కు అమ్మేస్తామంటే వైసీపీ నాయకులు తలలు ఊపుతూ మాట్లాడితే చూస్తు ఊరుకోమని శైలజానాధ్‌ ‌హెచ్చరించారు.

Leave a Reply