Take a fresh look at your lifestyle.

ఇడబ్ల్యుఎస్‌ ‌రిజర్వేషన్లను అమలుపై జోక్యంచేసుకోండి

గుంటూరు,జూన్‌ 18 : ‌రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం  ఇడబ్ల్యుఎస్‌ ‌రిజర్వేషన్లను అమలు చేయకపోవడంపై  జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. క రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం అందించిన 10శాతం రిజర్వేషన్లను కోల్పోతు న్నారని,రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనమైన వర్గాల వారంతా నష్టపోతున్నారని కన్నా అన్నారు. దేశంలోని ఉన్నత కులాల ప్రజలు ఆర్థికంగా బలహీనమైన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇదన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయడం లేదని, విద్యార్థులు ఉన్నత, వృత్తి విద్యా సంస్థలలో ప్రవేశంతో పాటు ఉపాధికి అనేక అవకాశాలను కోల్పోతున్నారని కన్నా పేర్కొన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ విభాగాలకు చెందిన ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, వై.ఎస్‌.‌జగన్మోహన్‌ ‌రెడ్డికి లేఖలు రాసినా..తమ విజ్ఞప్తులను పట్టించు కోలేదని కన్నా తెలిపారు. లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 10? రిజర్వే షన్లను వెంటనే అమలు చేయాలని,ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరినట్లు కన్నా లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply