Take a fresh look at your lifestyle.

ఎపి బీజేపీ చీఫ్‌ ‌సోము వీర్రాజు లిక్కర్‌ ఆఫర్‌..

ఆ ‌రాష్ట్రాలకేనా.. అంటూ కేటీఆర్‌ ‌సెటైర్‌
‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ఏపీలో బీజేపీ జనాగ్రహ సభలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిందని.. బీజేపీ అధికారంలోకి వొస్తే చీప్‌ ‌లిక్కర్‌ ‌రూ.75 లకే ఇస్తామని, వీలైతే రూ.50కే చీప్‌ ‌లిక్కర్‌ ఇస్తామంటూ చేసిన వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా సెటైర్‌లు సంధించారు.

సోము వీర్రాజు మాట్లాడిన వీడియోను ట్వట్టర్‌లో పోస్టు చేస్తూ.. ‘వాహ్‌.. ఏం ‌పథకం..చీప్‌ ‌లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనే బీజేపీ జాతీయ పథకం బీజేపీ నిరాశలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్‌ ఆఫర్‌ ఉం‌దా..?’ అంటూ క్యాప్షన్‌ను కూడా పెట్టారు. ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Leave a Reply