Take a fresh look at your lifestyle.

విశాఖకు మద్దతుగా నేడు ఎపి బంద్‌

  • మద్దతు ప్రకటించిన అఖిలపక్షం
  • ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందన్న మంత్రి పేర్ని

‌విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం 5న రాష్ట్ర బంద్‌ ‌నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయించింది. అయితే నేటి రాష్ట్ర బంద్‌కు వైసీపీ సంఘీభావం ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని మంత్రి పేర్ని నాని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణలో కుట్రకోణం ఉందనుకోవడం లేదని పేర్ని నాని చెప్పారు. తెలుగువాళ్ల పోరాట ఫలితమే విశాఖ ఉక్కు అని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఆయన గురువారం వి•డియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రజల ఆస్తిగానే ఉంచాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దీనిలో భాగంగా ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఒంటిగంట తర్వాత కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు. శుక్రవారం చేపట్టబోయే రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని ప్రభుత్వ విప్‌ ‌సామినేని ఉదయభాను తెలిపారు. విశాఖపట్నం స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల పక్షాలు, కార్మిక సంఘాలు చేపడుతున్న రాష్ట్ర బంద్‌కు ఉద్యోగులు, వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ప్రకటించటం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

విశాఖ స్టీల్‌ఎ•-‌లాంట్‌ ‌ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దానిలో భాగంగా గత నెల్లో విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌పై పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో సీఎం జగన్‌మోహన్‌ ‌రెడ్డి సమావేశమయ్యారు. కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌పై అనుకూలంగా బ్జడెట్‌ ‌సమావేశాల్లో తీర్మానం చేస్తామని వారికి హావి• ఇచ్చారు. ఇప్పటికే ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు.

ఇకపోతే ఇప్పటికే విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం రాష్ట్ర బంద్‌కు టీడీపీ తన మద్దతు ప్రకటించింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్దమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ట్రేడ్‌ ‌యూనియన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు.

Leave a Reply