Take a fresh look at your lifestyle.

ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభం

  • రివర్స్ ‌టెండరింగ్‌ ‌విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా
  • కొరోనా కట్టడికి రోజుకు 15వేలు పరీక్షలు …
  • ఇప్పటికే 5.5 లక్షల టెస్టులు పూర్తి
  • మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం
  • రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుతో మారనున్న దశ
  • ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌వీడియో ప్రసంగం

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తూనే…అభివృద్దిలో దూసుకుని పోతోందని ఎపి గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ అన్నారు. ఏపీ అసెంబ్లీ బ్జడెట్‌ ‌సమావేశాలు సందర్భంగా మంగళవారం ఆయన రాజ్‌భవన్‌ ‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వలోని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గవర్నర్‌ ‌బిశ్వభూషన్‌ ‌పేర్కొన్నారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యా, వైద్యం ఆరోగ్యం రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కితాబిచ్చారు. ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉందని, రివర్స్ ‌టెండరింగ్‌ ‌విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశామని గుర్తుచేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16 శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 8శాతం వృద్ధి రేటు సాధించామని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని పేర్కొన్నారు. గత ఏడాది కంటే తలసరి ఆదాయం 12 శాతం పెరిగిందన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని గవర్నర్‌ ‌తెలిపారు. రోజుకు 15వేలు పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటికే 5.5 లక్షల టెస్టులు చేసినట్లు చెప్పారు. జాతీయ సగటు కంటే ఏపీలో రికవరి రేటు అధికమని బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌తెలిపారు. ఎన్నికల హాలో ఇవ్వని 40 పథకాలను సైతం విజయవంతగా అమలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో వివిధ పథకాల కింద 3.98 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారు. దీని కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం. గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధి సాధించాం. 129 హాల్లో 77 హాలు నెరవేర్చారు. 39 హాలు పరిశీలనలో ఉన్నాయి. మేనిఫెస్టోలో లేని 40 హాలను కూడా నెరవేర్చడం జరిగింది. పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద.. మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ది చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్దు పథకం అమలు చేస్తున్నాం. దీనికోసం 1105 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ది చేకూరింది. దీనికోసం 3857 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మంది పొందారు. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్‌ఆర్‌ ‌కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ది.. దీని కోసం 53.85 కోట్లు ఖర్చు పెట్టాం. గ్రామ సచివాలయాల్లో 12వేల వైఎస్‌ఆర్‌ ‌క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు.. ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రజా ఆరోగ్యంలో భాగంగా 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం. వైఎస్‌ఆర్‌ ‌రైతు భరోసా పథకం మొదటి దశ పూర్తయింది, రూ.12500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13500లకు పెంచాం. మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుస్తూ.. రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశామని గవర్నర్‌ ‌పేర్కొన్నారు.

రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు:
కౌలు రైతులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు చేపట్టాం. ప్రతి గ్రామ సచివాలయంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గస్థాయిలో 147 వైఎస్‌ఆర్‌ ‌వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాం. జిల్లాస్థాయిలో 13 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశాం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధికి రూపకల్పన చేశాం. రూ.7వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నాం. మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్టేష్రన్‌ ‌చేయిస్తాం. నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తాం. 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయని వివరించారు. జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో14 ప్రాజెక్ట్ ‌పనులు పూర్తి చేశామని గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ అన్నారు. మిగిలిన ప్రాజెక్ట్ ‌పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, ‌సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ ‌పనులు పూర్తి చేస్తాం. విద్యుత్‌ ‌బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ. 17904 కోట్లు కేటాయించాం. ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించాం. దీని ద్వారా 36,810 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.11548 కోట్ల పెట్టుబడులు వస్తాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం వైఎస్‌ఆర్‌ ‌నవోదయ పథకాన్ని ప్రారంభించాం. భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులను వేగవంతం చేశాం. జీఎంఆర్‌ ‌సంస్థతో రూ.2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. రూ. 3200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తామని గవర్నర్‌ ‌వెల్లడించారు. కోవిడ్‌ ‌వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని గవర్నర్‌ అన్నారు. కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుంది. రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశాం. రాష్ట్రంలో మరణాల రేటు.. జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం టెస్టింగ్‌ ‌ల్యాబ్‌లను 1 నుంచి 13కు పెంచింది. రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులున్నాయి. కరోనా నివారణకు జిల్లాల్లో 65 ఆస్పత్రులు. 5,400 ఐసీయూ బెడ్స్, 38‌వేల ఐసోలేషన్‌ ‌బెడ్స్ ఆక్సిజన్‌ ‌సరఫరాతో 15వేల బెడ్స్ ఉన్నాయని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply