Take a fresh look at your lifestyle.

ఏ ‌గుర్తు ఉన్నా వోటుగా పరిగణించాలి..అర్థరాత్రి ఎన్నికల సంఘం ఉత్తర్వులు

  • సవాలు చేస్తూ బిజెపి హౌజ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌..‌స్వస్తిక్‌ ‌గుర్తునే పరిగణించాలని ఇసికి హైకోర్టు ఆదేశాలు

ఓ వైపు గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎప్పు‌డూ లేని విధంగా వోటేయడానికి ఉద్దేశించిన స్వస్తిక్‌ ‌ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా వోటుగా పరిగణించాలని అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో భారతీయ జనతా పార్టీ హౌస్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేయగా ఆ సర్క్యులర్‌ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు…తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌సర్క్యులర్‌ను సస్పెండ్‌ ‌చేసింది. అయితే, ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌సర్క్యూలర్‌ను సస్పెండ్‌ ‌చేసిన హైకోర్టు గెలుపోటముల దగ్గర మార్కింగ్‌ ఉం‌టే తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. స్వస్తిక్‌ ‌గుర్తు ఉన్న బ్యాలెట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు… వెంటనే అన్ని కౌంటింగ్‌ ‌కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్‌ ‌దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇదే తమ తొలి విజయమని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మరోవైపు స్వస్తిక్‌ ‌గుర్తు కాకుండా పోలింగ్‌ ‌స్టేషన్‌ ‌నంబర్లున్న గుర్తుతో వోటు వేసినట్టు వొస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ ‌పార్టీ స్పందించింది. స్వస్తిక్‌ ‌గుర్తు కాకుండా ఏ ఇతర గుర్తుతో వోటు వేసి ఉన్నా అక్కడ వోట్ల లెక్కింపును నిలుపుదల చేయాలని ఆ పార్టీ డిమాండ్‌ ‌చేసింది.

Leave a Reply