- పరిమితి పెంచి మరీ చేస్తున్నారు రానున్న రోజుల్లో పన్నులు పెంచడం ఖాయం
- హాస్పిటళ్లలో వసతులపై నేటి నుంచి సిఎల్పీ పర్యటన కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రమాదకరంగా మారుతు న్నాయని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన డియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేల కోట్ల అప్పు తెచ్చుకునేలా.. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. కార్పొరేషన్ అప్పులు సైతం 200 శాతానికి పెంచుకున్నారని, అప్పులు, పన్నుల భారం ప్రజల దే పడుతుందన్నారు. రుణాలు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేశారు. అప్పులను చూస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందా అని భయమేస్తోంది. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్లింది. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.318918 కోట్ల అప్పు చేసిందన్నారు. 70 ఏళ్లలో రూ.69000 కోట్ల అప్పు ఉంటే 6 ఏళ్లలో 3 లక్షల రూపాయల కోట్లు అప్పు చేశారు. అదనంగా అప్పులు చేసేందుకు ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేశారు. ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేసేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పులకు 40వేల కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే.. 6 లక్షల కోట్ల అప్పును ఎలా తీరుస్తారు? చివరికి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆందోలన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చడానికి మళ్లీ ప్రజలపై భారం వేయక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని గురించి ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఈ సీఎం చేస్తున్న అప్పులను ఆపకపోతే బతికే పరిస్థితి లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రభుత్వం అప్పులు చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ తరపున ప్రజల్లో చర్చ చేస్తాం.
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైద్యానికి ఖర్చు భరించలేక పేద ప్రజలు అప్పుల పాలవుతున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, పేదలకు ఉచిత వైద్యం అందించాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేతృత్వంలో జిల్లా ఆస్పత్రుల్లో పరిస్థితులను పరిశీలించేందుకు భద్రాచలం నుంచి పర్యటన చేస్తామన్నారు. బుధవారం భద్రాచలం నుంచి పర్యటన ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం నుంచి భద్రాచలం నుంచి హాస్పటిల్ విజిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస అవసరాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు.. ఈ క్రమంలోనే పలు హాస్పిటల్స్ ను సందర్శించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 26న భద్రాచలం, ములుగు, 27న, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల్ 28న, కొమురం భీం ఆసిఫాబాద్ , అదిలాబాద్ 29న నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ 30 న, సిరిసిల్ల ,కామారెడ్డి, మెదక్ 31న సంగారెడ్డి, హైదరాబాద్. సెప్టెంబర్ 1న, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి. సెప్టెంబర్ 2 న నాగర్ కర్నూల్, నల్గొండ. సెప్టెంబర్ 3న, సూర్యాపేట వరంగల్. సెప్టెంబర్ 4 న, జనగాం, యాదాద్రి భువనగిరి , మేడ్చల్ మల్కాజ్ గిరి. సెప్టెంబర్ 5న , హైదరాబాద్ సందర్శన ఉంటుందని పేర్కొన్నారు.