- తెలంగాణలో రూ .80 కోట్లు పెట్టుబడి
- బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు ప్రకాష్ రాజ్
ప్లైవుడ్ పరిశ్రమలో ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన ఆస్టిన్ ప్లైవుడ్ ఇటీవలనే ‘ఆస్టిన్ కేర్స్’ శీర్షికన నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడటంతో పాటుగా ప్రస్తుత కొరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సైతం తోడ్పడెలా అత్యున్నత శ్రేణి యాంటీ వైరస్ ప్లైవుడ్‌ను ఆవిష్కరించింది.అంతర్జాతీయంగా మహమ్మారి విజృంభించడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నూతన వేరియంట్ ప్లైవుడ్‌ను ఆస్టిన్ ప్లైవుడ్ ప్రత్యేకంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మీ ఇల్లు, నివాసప్రాంగణాలను సురక్షితంగా మలిచే రీతిలో తీర్చిదిద్దిందని .. యాంటీ మైక్రోబియాల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీవైరల్ పార్టికల్స్‌తో తయారైన ఈ ప్లైవుడ్ 99.99% వైరస్‌ను సైతం నిర్ములించడం తో పాటుగా మీ ఇల్లును సురక్షితంగా మరియు ఆరోగ్యంగా మలుస్తుందని నిర్వాహకులు ఒక కటనలో తెలిపారు. ఈ ఉత్పత్తిని తాజ్దక్కన్, హైదరాబాద్ లో నటుడు, దర్శకుడు, నిర్మాత ప్రకాష్ రాజ్ మరియు ఆస్టిన్ ప్లైవుడ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ అగర్వాల్ , డైరెక్టర్ నిశాంత్ అగర్వాల్ సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా నిశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో బలీయమైన మార్కెట్‌ను మరీ ముఖ్యంగా తెలంగాణాలో చక్కటి మార్కెట్ కలిగిన ఆస్టిన్ ప్లైవుడ్‌ను 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా విస్తరించాలని ప్రణాళిక చేసినట్లు వెల్లడించారు. ‘‘మన ప్రధానమంత్రి ప్రారంభించిన స్వీయ సమృద్ధి లేదంటే ఆత్మనిర్భర్ కార్యక్రమం మహోన్నతమైనది. భారతీయ బ్రాండ్లు వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడుతుంది. మా వ్యాపారం లాక్డౌన్ దశలో 30% వృద్ధి చెందడానికి కారణమూ ఈ ప్రచారమే’’ అని అన్నారు.
మహమ్మారి కారణంగా భయాందోళనలకు గురవుతున్న సమయంలో తమ వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగిస్తామనే భరోసా కలిగిస్తూ ప్రత్యేకంగా ఆస్టిన్ యాంటీ వైరస్ ప్లైవుడ్‌ను తీర్చిదిద్దాం .. ఇది రక్షణ మరియు ఉపశమనాన్ని ఖచ్చితంగా అందించగలదు అని అన్నారు