Take a fresh look at your lifestyle.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం – ఒక సందర్భం

“పార్టీ ఫిరాయింపుల ప్రక్రియకు ఆజ్యం పోసేది ఎక్కడైనా అధికార పార్టీలే.అధికార పార్టీ ఆకర్షణీయమైన పార్టీగా మారినప్పుడు ఫిరాయింపులు క్రమాణుగతమవుతాయి. ఎన్నికలలో విజయం సాధించడంలో విఫలమైన రాష్ట్రాలలో ఆయ ప్రభుత్వాలను కూల్చివేసేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని బిజేపి ఆరోపనలను ఎదుర్కుంటోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాలే ఈ విషయాన్ని రుడీ పరుస్తున్నాయి. ప్రస్తుతం రాజస్తాన్‌ ‌రాజకీయాలలో తనను ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ పట్ల సచిన్‌ ‌పైలట్‌ ‌చర్యలు, ఆయన నిర్వహిస్తున్న సమావేశాలు ఆయన స్వచ్ఛందంగా కాంగ్రెస్‌ ‌సభ్యత్వాన్ని వదులుకుంటున్నాడని సూచిస్తున్నాయి. ఇది ఫిరాయింపు మొదటి దశకు ఆరంభం.”

భారతదేశ రాజకీయ వ్యవస్థలో అత్యంత సమస్యాత్మకమైన వివాదాలలో పార్టీ-ఫిరాయింపుల అంశం ఒకటి. మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 1967 వరకు దేశంలో పెద్దగా ఫిరాయింపులు జరింది లేదు. నెహ్రూ, శాస్త్రీల మరణానంతరం దేశ రాజకీయాలలో వచ్చిన పెను మార్పులు పార్టీ ఫిరాయింపులను ఉదృతం చేశాయి. వీటిని నిరోధించడానికి వ్యవస్థికృతమైన రాజ్యాంగ చట్టం లేకపోవడం, విభిన్నమైన పార్టీ ధృక్పతాలు కూడా కారణభూతమయ్యాయి. పార్టీ ఫిరాయింపులను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో అనేక ప్రయత్నాలు జరిగాయి. తొలిసారిగా పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రం 1979లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించింది. 1985లో రాజీవ్గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. సహజంగా పార్టీ ఫిరాయింపు రెండు దశలలో జరుగుతుంది. – మొదటిది, ఒక ప్రజా పరతినిధి తన సభ్యత్వం గల రాజకీయ పార్టీ పట్ల విధేయతను వదిలివేయడం. రెండవది, తన ప్రాతినిథ్యం లేని మరొక పార్టీ పట్ల ఒక సభ్యుడు తన విధేయతను ప్రకటించడం. బాధిత పార్టీ మొదటి దశలోనే సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయవచ్చు.

ఫిరాయింపుల నిరోధక చట్టం పెద్ద వైఫల్యమని మొదటి నుంచి తీవ్ర విమర్శలకు గురౌతూనే ఉంది. ప్రజలు ఈ చట్టం పట్ల విశ్వాసాన్ని చూపకపోవడం కూడ కొంతవరకు నిజం. అయితే, ఎన్నుకోబడిన సభ్యులు పదవిని కోల్పోవడానికి చట్టబద్ధమైన ముప్పు లేనట్లయితే, కేంద్రంలోని అధికార పార్టీ రాజస్థాన్లో కనీసం 50 మంది శాసనసభ్యులను ఏ సమయంలోనైనా ఆకర్షించి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేదే. ఫిరాయింపుల నిరోధక చట్టం, ఉధృతంగా జెండాలను మార్చే ఫిరాయింపుల వరదను ఆపడానికి బలహీనమైన ఆనకట్ట అయినప్పటికీ, చిన్న ఫిరాయింపులను నిరోదించగలదు. 1967 మరియు 1971 సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికైన దాదాపు 4,000 మంది శాసనసభ్యులలో దాదాపు సగం మందికి పైగా పార్టీ ఫిరాయించినట్లు అంచనా వేయబడింది. ఇది అనేక రాష్ట్రాలలో మరియు జాతీయ స్థాయిలో రాజకీయ గందరగోళానికి దారితీసింది. అదే పరిస్థితులు కొనసాగి ఉంటే మన ప్రజాస్వామ్యం యొక్క పునాదులు ఇప్పటికి నాశనం అయ్యేవి. పార్టీ ఫిరాయింపుల ప్రక్రియకు ఆజ్యం పోసేది ఎక్కడైనా అధికార పార్టీలే.అధికార పార్టీ ఆకర్షణీయమైన పార్టీగా మారినప్పుడు ఫిరాయింపులు క్రమాణుగతమవుతాయి.

ఎన్నికలలో విజయం సాధించడంలో విఫలమైన రాష్ట్రాలలో ఆయ ప్రభుత్వాలను కూల్చివేసేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని బిజేపి ఆరోపనలను ఎదుర్కుంటోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాలే ఈ విషయాన్ని రుడీ పరుస్తున్నాయి. ప్రస్తుతం రాజస్తాన్‌ ‌రాజకీయాలలో తనను ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ పట్ల సచిన్‌ ‌పైలట్‌ ‌చర్యలు, ఆయన నిర్వహిస్తున్న సమావేశాలు ఆయన స్వచ్ఛందంగా కాంగ్రెస్‌ ‌సభ్యత్వాన్ని వదులుకుంటున్నాడని సూచిస్తున్నాయి. ఇది ఫిరాయింపు మొదటి దశకు ఆరంభం. పైలట్‌, ఆయన సమూహానికి చెందిన ఎమ్మెల్యేల చర్యలన్ని రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ ‌లోని పేరా 2 (1) (ఎ), లేదా ఫిరాయింపు వ్యతిరేక చట్టంకు పూర్తి వ్యతిరేఖంగా ఉన్నాయి. పేరా 2 అనర్హతకు రెండు కారణాలను చూపిస్తుంది: (ఎ) సదరు రాజకీయ పార్టీలో తన సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటేబీ లేదా (బి) సదరు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేస్తే లేదా సభలో ఓటు వేయడాన్ని గైర్హాజరు కావడం. కొన్ని మీడియా నివేదికలు చెప్పినట్లుగా, ‘ఎ’ మరియు (బి) నిబంధనల మధ్య ‘లేదా’ ఉందని గమనించండి. అది ‘మరియు’ అయితే, పైలట్‌ ‌వంటి ఫిరాయింపుదారులకు మరికొంత అవకాశం ఉంటుంది. కానీ చట్టం స్పష్టంగా ఉంది. స్పీకర్‌ ‌తన ప్రవర్తనను పరిశీలించి, ‘‘సదరు రాజకీయ పార్టీ (కాంగ్రెస్‌) ‌సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం’’ అని ఊహించవచ్చు. తన ఊహే నిజమని భావిస్తే, స్పీకర్‌ ఆయనను అనర్హులుగా ప్రకటించడానికి ఇంకేమీ దర్యాప్తు చేయనవసరం లేదు.

చట్టంలో చర్చ, అసమ్మతి, మెజారిటీ అభిప్రాయానికి భిన్నంగా ఉండటం వంటివి సాధారణంగా వాక్‌ ‌మరియు భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. అలాగే ఏదైనా రాజకీయ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగం కూడ. రాజ్యాంగం, పదవ షెడ్యూల్‌ ‌ప్రకారం అసమ్మతి, వ్యత్యాసాలు లేని ప్రజాస్వామ్యం లేదు. పేరా 2 (1) (ఎ) మాతృ పార్టీని విడిచిపెట్టే నిష్క్రియాత్మక మార్గాన్ని నిషేధిస్తుందిబీ పేరా 2 (1) (బి) పార్టీ జారి చేసిన ‘విప్‌’‌కు వ్యతిరేకంగా ఓటువేసినా, గైర్హాజరు అయినా సభ్యత్వాన్ని కోల్పోతారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉద్దేశపూర్వకంగానే ‘రాజీనామా’ అనే భావనను విడిచిపెట్టారు. ఎందుకంటే ఎన్నికైన సభ్యుడు తన పదవిని కోల్పోవటానికి ఇష్టపడడు. పార్టీ నుండి బహిష్కరించబడిన తరువాత కూడా ఆయన తన దానిని నిలుపుకోగలడు. కానీ అధికార పార్టీ తన ప్రభుత్వానికి ముప్పు ఏర్పడే సందర్భంలో సదరు శాసన సభ్యుడిని తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని బలవంతం చేసే అధికారం ఉంది. అందువల్ల సభ్యులు పార్టీని విడిచిపెట్టిన దశకు చేరుకున్నప్పుడు వారి కార్యకలాపాలను అరికట్టడానికి ‘‘స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం’’ అనే వ్యక్తీకరణను చేర్చారు. పైలట్‌ ‌యొక్క ప్రవర్తన, ప్రకటనలను గమనిస్తే ఆయన కాంగ్రెసేతర పార్టీల మద్దతుతో సిఎం కావాలన్న తన ఆశయాన్ని నెరవేర్చుకోడానికి తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సిద్దమయ్యాడని స్పష్టంగా కనబడుతోంది. ఇది ప్రజా తీర్పును నిర్దాక్షిణ్యంగా అణచివేయడమే. రెండవ దశ – పార్టీ ఆదేశాలను స్పష్టంగా ధిక్కరించడం – ఇది ఇంకా రాజస్థాన్లో ఇంకా జరగలేదు కాబట్టి, పేరా 2 (1) (బి) వ్యతిరేకంగా ఏవైనా వ్యాజ్యాలు ఉంటే అవి అకాలమైనవి. కోర్టు సమయాన్ని వృథా చేసే పైలట్కు హక్కు లేదు. మొత్తం ప్రజాస్వామ్య యంత్రాంగం రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉన్నప్పటికీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ‘రాజకీయ పార్టీ’ల గురించి ప్రస్తావించబడలేదు. హాస్యాస్పదంగా, పైలట్‌ ‌తనకున్న వాక్‌ ‌స్వాతంత్య్రం కారణంగా అకాల దశలో కోర్టులను ఆశ్రయించాడు. అయితే, ఇది ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ద్వారా నిరోధించబడింది. ఇది కిహోటో హోలోహన్‌ ‌వర్సెస్‌ ‌జాచిల్హు కేసులో సుప్రీంకోర్టు తిరస్కరించిన రెస్‌ ‌జుడికాటా కేసు (నిర్ణయించిన కేసును లేవనెత్తడం కాదు) వంటిది. కాంగ్రెస్‌ ‌లెజిస్లేచర్‌ ‌పార్టీ పిటిషన్పై స్పీకర్‌ ‌స్పందనలను నిరోధించడానికి పైలట్కు హైకోర్టుకు వెళ్ళే అవసరం లేదు. రాజ్యాంగ నిబంధనలు, సహజ న్యాయం సూత్రాలు, మాలా ఫిడే వంటి వాటిని ఉల్లంఘించినందుకు స్పీకర్‌ ఆదేశాన్ని పరిశీలించడానికి న్యాయ సమీక్ష అందుబాటులో ఉంది. స్పీకర్‌ ఇం‌కా నిర్ణయం తీసుకోనప్పుడు, సమీక్షించాల్సినది ఏమిటి?

ఒక శాసనసభ్యుడు తన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరియు ప్రత్యర్థి పార్టీ నాయకులను కలిసినప్పుడు ఫిరాయింపులుగా కోర్టులు భావిస్తాయి. ఫిరాయింపు ఆధారం లేకుండా అది అసమ్మతిగా ఉంటే, సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించడానికి స్పీకర్కు ఎటువంటి ఆధారాలు లేవు. రాజేంద్ర సింగ్‌ ‌రానా వర్సెస్‌ ‌స్వామి ప్రసాద్‌ ‌మౌర్య కేసులో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంలో, తన పార్టీ ప్రభుత్వాన్ని తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తూ గవర్నర్కు నివేధించే ప్రతిపక్ష ప్రతినిధి బృందంలో భాగమైనప్పుడు స్పీకర్‌ ఒక శాసనసభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాడు. అది res ipsa loquitur (విషయం స్వయంగా మాట్లాడుతుంది). ‘‘వారి చర్య పదవ షెడ్యూల్‌ ‌యొక్క పేరా 2 (1) (ఎ) లో ఉందని తెలుసుకోవడానికి తదుపరి ఆధారాలు లేదా విచారణ అవసరం లేదు’’ అని కోర్టు తెలిపింది. పైలట్‌ ‌యొక్క ప్రవర్తన రెస్‌ res ipsa loquitur మరియు అతని కేసు రెస్‌ ‌జుడికాటా ద్వారా వీగిపోతుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిరాయింపుల సూత్రదారులు టేప్లో పట్టుబడ్డారు. ఇది మాలా ఫిడేను బహిర్గతం చేస్తుంది. ఇది అవినీతి నిరోధక చట్టం క్రింద చట్టవిరుద్ధమైన సంతృప్తి కోసం చేసే ప్రయత్నం. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా వివిధ స్థాయిల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాజకీయ పార్టీల ద్వారానే ఎన్నికల ప్రక్రియ, ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుంది. అయితే ఒక రాజకీయ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులు అధికారం కోసం తరచుగా మరో పార్టీలోకి మారుతున్నారు. విలువలకు తిలోదకాలిచ్చి అవకాశ వాదంతో పార్టీలను ఫిరాయించడం వల్ల రాజకీయ అస్థిరత్వం ఏర్పడటంతో పాటు ప్రజాభిప్రాయానికి భంగం వాటిల్లుతోంది.

 

జయప్రకాశ్‌ అం‌కం

Leave a Reply