Take a fresh look at your lifestyle.

విశాఖలో మరో పదిరోజులు లాక్‌డౌన్‌ ‌పెట్టాలి: విష్ణు

విశాఖపట్టణం,జూలై 28 : కరోనా కేసులు పెరుగుతున్నందున విశాఖలో 10 రోజులు లాక్‌డౌన్‌ ‌విధించాలని బీజేపీ నేత విష్ణుకుమార్‌ ‌రాజు డిమాండ్‌ ‌చేశారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగు పరచాలని,నర్సింగ్‌ ‌స్టాప్‌ను తక్షణమే నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా విష్ణుకుమార్‌ ‌రాజు మాట్లాడుతూ విశాఖలో సుమారు 7,500లకుపైగా కేసులు నమోదయ్యాయని,రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు.

భవిష్యత్‌లో 50వేల మార్క్ ‌దాటే అవకాశముందని అన్నారు.ఇదేగాని జరిగితే విశాఖ అంతా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. అందుచేత ఓ 10 రోజులపాటు లాక్‌ ‌డౌన్‌ ‌పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ట్లు విష్ణుకుమార్‌ ‌రాజు చెప్పారు.ప్రజలు సరైన వైద్య సాయం అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టెస్టులు పెంచి, ఆస్పత్రుల్లో చికిత్స సౌకర్యాలు పెంచాలన్నారు.

Leave a Reply