Take a fresh look at your lifestyle.

మరో ఉద్దీపన ప్యాకేజీ..!

  • ఆర్థికమంత్రితో ప్రధాని మోదీ సమావేశం
  • వరుస భేటీలతో ప్యాకేజీలపై అంచనాలు
  • బ్యాంకర్లతో ఆర్‌బిఐ గవర్నర్‌ ‌భేటీతో
  • ఊహాగానాలకు ఊపు

కొరోనా వైరస్‌, ‌లాక్‌డౌన్‌ ‌సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం మరో ఉద్దీపన్‌ ‌ప్యాకేజీ సిద్ధపడుతోందన్న సమచారం వస్తోంది. వరుస సమావేశాలతో, సక్షలతో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థికమంత్రి, •ం మంత్రులతో తాజా భేటీ ఈ అంచనాలకు బలాన్నిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాటి నెలవారీ జీఎస్టీ వసూళ్ల గణాంకాల విడుదలను ఆర్థికమంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. ఆర్థిక ప్రతిష్టంభనకు ప్రభావితమైన రంగాలకు ఊతమిచ్చేందుకు రెండవ ఉద్దీపన ప్యాకేజీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, •ం‌మంత్రి అమిత్‌ ‌షాతో ప్రధాని సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంతోపాటు ఇతర ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులతో కూడా ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే మైక్రో, స్మాల్‌ అం‌డ్‌ ‌డియం ఎంటర్పైజ్రెస్‌ (ఎంఎస్‌ఎంఇ) ‌వంటి కీలక ఆర్థిక మంత్రిత్వ శాఖల మంత్రులతో భేటీ అయ్యారు.

మరోవైపు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియాగవర్నర్‌ ‌శక్తికాంత దాస్‌ ‌శనివారం బ్యాంక్‌ ‌చీఫ్‌లతో సమావేశం అయినట్లు సమాచారం. భారత్‌లో కరోనా వైరస్‌ ‌వ్యాప్తి.. సంక్షోభం క్రమంలో దేశ ఆర్థిక పరిస్థితి, అలాగే పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చేపట్టిన పలు చర్యల అమలుపైనా చర్చిస్తారు. వడ్డీ రేట్లు, వాటి బదిలీ, పరిశ్రమకు మద్దతుగా చర్యలు వంటి అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. దీంతో పాటు ఎంఎస్‌ఎంఇ ‌పరిశ్రమ, గ్రాణ రంగానికి అనుకూలంగా చేపట్టిన విధానాలను కూడా సక్షించారని తెలుస్తోంది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు చేపట్టాల్సిన మరిన్ని చర్యలకు గాను బ్యాంకర్ల నుంచి సలహాలు, సూచనలను కూడా స్వీకరించనున్నారు.

Leave a Reply