న్యూయార్క్, ఫిబ్రవరి 23 : అగ్ర రాజ్యం అమెరికా మరోసారి మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు తుపాను కురుస్తుండటంతో..ఏకంగా 1500 విమానాలు రద్దు అయ్యాయి. పలు నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 55 నుంచి 70 కిలోటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, భారీ మంచు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రహదారులపై ప్రయాణించే వారు తప్పనిసరిగా తమ వెంట సేప్టీ కిట్‌ను ఉంచుకోవాలని నిపుణులు సూచించారు. విన్నేసోటా, డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ, మినియాపోలిస్, సెయింట్‌పాల్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి.
ఈ పరిస్థితుల మధ్య 1500 విమానాలను రద్దు చేశారు. లక్షలాది నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ ప్రమాదకరపు శీతాకాలపు తుపాన్‌ను ఎదుర్కునేందుకు సిద్ధం కావాలని లాస్ ఏంజిల్స్‌లోని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక వైపు అమెరికా పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు చలికి వణికిపోతుంటే.. తూర్పు ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం గమన్హరం.