Take a fresh look at your lifestyle.

కరీంనగర్ లో ఒకరికి కొరోనా పాజిటివ్..!

ఇండోనెషియా నుంచి కరీంనగర్ కు వొచ్చిన 13 మంది లో ఒకరికి కొరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడం ..వైరస్ విస్తరణ నేపథ్యంలో  కరీంనగర్
కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక ,సీపీ కమలాసన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.రేపటి నుంచి కరీంనగర్ నగరంలో  ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దు అని ,నగరం లో తీవ్రత ఉంది ..ప్రార్ధనా మందిరాలకు వెళ్లవద్దని మంత్రి కమలాకర్ సూచించారు.ఇండోనేషియా నుంచి వచ్చిన 13 మంది కలెక్టరేట్ ప్రాంతాల్లో 48గంటల పాటు  పర్యటించారు కాబట్టి కలెక్టరేట్ నుంచి 3కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంటింటా పరీక్షలు నిర్వహించేందుకు 100 బృందాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు.ఇంటింటా పరీక్షలు నిర్వహించాలంటే అందరు ఇళ్లలోనే ఉండి సహకరించాలనికోరారు.

- Advertisement -

పెళ్లిళ్లు ,శుభకార్యాలు ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం..నగరం సురక్షితంగా ఉండాలంటే ప్రజలందరూ సహకరిస్తే సాధ్యమౌతుందన్నారు.
నిత్యావసర వస్తువులు మినహా, అన్ని వ్యాపార సంస్థలు స్వచ్చందంగా మూసివేస్తేనే మంచిది..
ఇంటి వద్ద ఉండటం సామాజిక బాధ్యతగా గుర్తించాలని కలెక్టర్ కోరారు.

Leave a Reply