Take a fresh look at your lifestyle.

ఎ‌ర్రగడ్డ ఛెస్ట్ హాస్పిటల్ లో రెండోరోజూ మరో రోగి మృతి

వైద్యం అందడం లేదంటూ సెల్ఫీ వీడియో

హైదరాబాద్ :ఎ‌ర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో మరో దారుణం జరిగింది.  తనకు చికిత్స చేయడం లేదని సెల్ఫీ వీడియో తీసి సయ్యద్‌ అనే రోగి చనిపోయాడు. అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వీడియోలో సయ్యద్‌ ‌వాపోయాడు. ఆదివారం జవహర్‌నగర్‌ ‌బీజేఆర్‌ ‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి కొరోనాతో మృతి చెందాడు. తనకు ఊపిరి ఆడటంలేదని చెప్పినా వెంటిలేటర్‌ను తొలగించారని, చనిపోయే ముందు తండ్రికి రోగి సెల్ఫీ వీడియో పంపాడు.
3 గంటలుగా బతిమిలాడినా సిబ్బంది వెంటిలేటర్‌ ‌పెట్టడంలేదని, గుండె ఆగిపోతోందని, ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుందంటూ వ్యక్తి తల్లడిల్లాడు. వద్దన్నా వినకుండా గవర్నమెంట్‌ దవాఖానాలో  చేర్పించారని, తాను చచ్చిపోతున్నా.. బాయ్‌ ‌డాడీ అంటూ ఆ రోగి వీడియోలో చెప్పాడు. రోగి మృతిపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.. సోమవారం మరో రోగి మృతికి వైద్యులు కారణమయ్యారు. వైద్యుల తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్‌ హాస్పిటల్స్ కు  లక్షల రూపాయలు పెట్టలేక ప్రభుత్వ హాస్పిటల్ కి వస్తే ప్రాణాలు పోతున్నాయని సమాన్యులు మండిపడుతున్నారు.

Leave a Reply