Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా మరో 80 కొరోనా కేసులు

  • కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 893కి చేరిక
  • కర్నూలులో కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి

ఆం‌ధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 80 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 893కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 31, విశాఖపట్నం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 21 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 141కి చేరింది. కొత్తగా కరోనాతో ఇద్దరు మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 27గా నమోదైంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 725 కరోనా యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. ఇకపోతే కరోనా వైరస్‌ ‌నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ ‌దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకుగానూ ఏపీ సర్కార్‌ 830 ‌కరోనా పరీక్షలు నిర్వహించింది.

- Advertisement -

ఏపీ తర్వాత రాజస్తాన్‌ 809 ‌మందికి పరీక్షలు నిర్వహించి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 41,512 పరీక్షలు చేపట్టింది. అంతేకాక నిన్న ఒక్క రోజే 5,757 మందికి టెస్టులు నిర్వహించమని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 813 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే కర్నూలులో కరోనా కట్టడికి సీఎం జగన్‌ ‌ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కర్నూలు జిల్లాలో 37 రెడ్‌జోన్లను గుర్తించామని, ప్రతి రెడ్‌జోన్‌లో ఫీవర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కర్నూలులో స్టేట్‌ ‌కోవిడ్‌ ఆస్పత్రి, పీసీఆర్‌ ‌ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు. కర్నూలు జిల్లాలో 234 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఏపీలో 893కు కరోనా పాజిటివ్‌ ‌కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి, ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కర్నూలులో 31, గుంటూరులో 18, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 6, అనంతపురంలో 6, ప్రకాశంలో 2, కృష్ణా జిల్లాలో 2, విశాఖలో ఒక పాజిటివ్‌ ‌కేసు నమోదయింది. ఏపీలో ఇప్పటి వరకు 141 మంది డిశ్చార్జ్ ‌చేశారు. 725 మందికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 27 మంది మృతి చెందారు.

Leave a Reply