Take a fresh look at your lifestyle.

ఆం‌దోళన విరమించండి.. మరోమారు చర్చలకు రండి

రైతులను కోరిన వ్యవసాయ మంత్రి తోమర్

రైతులు ఆందోళన విరమించి కేంద్రంతో చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయం మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌మరోమారు విజ్ఞప్తి చేశారు. రైతులు ఆందోళనను విరమించాలన్న ఆయన.. చర్చల్లో ప్రతిష్టంభనను తొలగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది.. పలు దఫాలుగా కేంద్ర సర్కార్‌, ‌రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలం కాగా.. కేంద్రం చేసిన ఎనిమిది ప్రతిపాదనలు కూడా రైతులు వ్యతిరేకించారు. దీంతో.. కేంద్రం, రైతుల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.. ఇదే సమయంలో.. ఆందోళనను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్న రైతులు.. భవిష్యత్‌ ‌కార్యాచరణను ప్రకటించారు. అయితే, చర్చలకు రావాలంటూ రైతులకు విజ్ఞప్తి చేశారు రైతుల ఉద్యమంతో సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు వెంటనే తమ ఉద్యమాన్ని విరమించుకొని, చర్చలు జరపాలని కోరారు.

ఇక, టిక్రీ సరిహద్దుల వద్ద రైతుల ఆందోళనలో షర్జీల్‌ ఇమామ్‌ ‌ఫొటో కనిపించడంపై మండిపడ్డారు తోమర్‌.. ఈ ఉద్యమం కనీస మద్దతుధర, మండీలు, రైతులకు చెందిన ఉద్యమం. మరి షర్జీల్‌ ఇమామ్‌ ‌పోస్టర్‌ ‌రైతు సమస్య ఎలా అవుతుంది..? ఇది అత్యంత ప్రమాదమైంది..? దృష్టి మరల్చడానికి మాత్రమే ఇలా చేస్తున్నారు…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి కేంద్రం ఆలోచిస్తూనే ఉంది.. కనీస మద్దతు ధరను మరింత పటిష్ఠం చేసే విషయంలో ఏమి చేస్తే బాగుంటుందని రైతుల అభిప్రాయాలను కోరాం, కానీ రైతులు మాత్రం తగిన జవాబివ్వలేదన్నారు.. రైతుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రైతులు చర్చిస్తే బాగుటుందన్నారు.  కేంద్ర మంత్రి విజ్ఞప్తిపై రైతులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.

Leave a Reply