Take a fresh look at your lifestyle.

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

  • ఈవీ రంగంలో రూ.2100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వొచ్చిన ట్రైటాన్‌ ‌సంస్థ
  • సంస్థకు మంత్రి కేటీఆర్‌ ‌ధన్యవాదాలు

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈవీ రంగంలో రూ.2100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ట్రైటాన్‌ ‌సంస్థ ముందుకు వొచ్చింది. జహీరాబాద్‌ ‌నిమ్జ్‌లో ఎలక్ట్రిక్‌ ‌వెహికల్‌ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌యూనిట్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వొచ్చే అవకాశం ఉంది.

తొలి ఐదేళ్లలో సుమారు 50 వేల ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించనుంది. పెట్టుబడి కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు ట్రైటాన్‌ ‌సంస్థకు మంత్రి కేటీఆర్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే ఎలక్ట్రిక్‌ ‌వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply