Take a fresh look at your lifestyle.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

3వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న మెడ్‌‌ట్రాక్‌
‌వైద్యపరికరాల తయారీకి అంగీకరించిన సంస్థ
అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్‌తో ప్రతినిధుల భేటీ

న్యూయార్క్,‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే18: అమెరికాకు చెందిన మరో భారీ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకిరంచింది.  వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్‌ ‌ట్రానిక్‌  ‌కంపెనీ 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో… కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటన చేశారు. మెడ్‌ ‌ట్రానిక్‌ ‌నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్‌ ‌స్వాగతించారు. వైద్య పరికరాల తయారీ, అభివృద్ధి రంగంలో హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌హబ్‌గా మారిందని
కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ‌బహుళ జాతి కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన బహుళజాతి కంపెనీల గురించి వివరిస్తున్నారు.అంతకు ముందు ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్‌ ‌బ్యాంకింగ్‌ ‌కంపెనీ ఆరన్‌ ‌క్యాపిటల్‌  ‌తెలంగాణ సర్కార్‌తో డీల్‌ ‌కుదుర్చుకున్నది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను ఆరన్‌ ‌క్యాపిటల్‌ ‌చైర్మన్‌ ‌డేవిడ్‌ ‌వోల్ఫే నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్‌ ‌బృందం కలిసింది. న్యూయార్క్‌లో ఆ భేటీ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, ఆరన్‌ ‌క్యాపిటల్‌ ‌మధ్య సహకారం గురించి చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. ఆవిష్కరణ వ్యవస్థతో పాటు అత్యుత్తమ మౌళిక సదుపాయాలు, నైపుణ్యవంతమైన వర్క్‌ఫోర్స్ ‌కూడా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

కంపెనీలను విలీనం చేయడంలో, కొనుగోలు చేయడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో, ఫైనాన్సింగ్‌, అడ్వైజరీ సేవల్లో ఆరన్‌ ‌క్యాపిటల్‌ ‌సంస్థ ప్రత్యేకత కలిగి ఉంది. అనేక రకాల పరిశ్రమలకు చెందిన క్లయింట్లు ఆ కంపెనీకి ఉన్నారు. డియా, హెల్త్‌కేర్‌, ‌లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌కన్జూమర్‌ ‌ప్రొడక్టస్, ‌సర్వీసెస్‌, ‌ఫుడ్‌ అం‌డ్‌ ‌బివరేజెస్‌, ‌పరిశ్రమలు, టెక్నాలజీ, రియల్‌ ఎస్టేట్‌ ‌లాంటి రంగాల్లో ఆ కంపెనీకి క్లయింట్లు ఉన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఇన్వెస్టర్‌ ‌రౌండ్‌టేబుల్‌ ‌టింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా, యూఎస్‌ ఇం‌డియా స్ట్రాటజిక్‌ ‌పార్ట్నర్‌షిప్‌ ‌ఫోరమ్‌ ‌సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమావేశంలో కేటీఆర్‌ ‌ప్రసంగించారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం చాలా ఆదర్శవంతంగా ఉంటుందని, ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొదలుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడిన విషయాలను ట్వీట్‌ ‌చేశారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో తెలంగాణ సర్కార్‌ ‌ప్రగతిశీల పథంలో వెళ్తున్నట్లు ఆయన మంత్రి తెలిపారు. తమ విధానాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇన్నోవేషన్‌ ‌వ్యవస్థను ఉత్తేజ పరిచే విధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మొత్తం 14 రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ రంగాలకు విస్తృత రీతిలో అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇండియాను లక్ష్యంగా ఎంపిక చేసుకునే పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొదలుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడిన విషయాలను ట్వీట్‌ ‌చేశారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో తెలంగాణ సర్కార్‌ ‌ప్రగతిశీల పథంలో వెళ్తున్నట్లు ఆయన మంత్రి తెలిపారు. తమ విధానాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇన్నోవేషన్‌ ‌వ్యవస్థను ఉత్తేజ పరిచే విధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 14 రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ రంగాలకు విస్తృత రీతిలో అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇండియాను లక్ష్యంగా ఎంపిక చేసుకునే పెట్టుబడిదారులకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. ఇదే రౌండ్‌టేబుల్‌ ‌సమావేశంలో ఇండియన్‌ ‌కౌన్సుల్‌ ‌జనరల్‌ ‌రణ్‌ధీర్‌ ‌జైశ్వాల్‌ ‌మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అంశాల్లో.. తెలంగాణ, హైదరాబాద్‌ ‌ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. మంత్రి కేటీఆర్‌ ‌చురుకుదనాన్ని ఆయన విశేషంగా మెచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్‌ ‌తన విన్నూత విధానాలతో హైదరాబాద్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నారని రణ్‌ధీర్‌ ‌తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ జయేశ్‌ ‌రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ‌ప్రమోషన్‌ అం‌డ్‌ ఎన్‌ఆర్‌ఐ ‌స్పెషల్‌ ‌సెక్రటరీ ఈ విష్ణువర్ధన్‌ ‌రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply