Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో మరోమారు భారీ వర్షం

  • పలు ప్రాంతాల్లో జోరువాన
  • మున్సిపల్‌ ‌సిబ్బంది అప్రమత్తం…అధికారులతో మేయర్‌ ‌సవిక్ష

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం మళ్లీ వర్షం దంచికొట్టింది. అనేకచోట్ల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌ ‌జామ్స్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కావడంతో.. వరదనీటిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. మదాపూర్‌, ‌షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్‌, ‌కిస్మత్‌పర్‌, ‌బండ్లగూడ జాగీర్‌ ‌ప్రాంతాల్లో వర్షం పడింది. అత్తాపూర్‌, ‌శివరాంపల్లిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురియగా.. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, ‌చింతల్‌, ‌గాజులరామారం, సుచిత్ర, ఆల్విన్‌ ‌కాలనీ, హైదర్‌నగర్‌, ‌నిజాంపేట్‌, ‌ప్రగతినగర్‌, ‌బాచుపల్లి, కొంపల్లిలలో భారీ వర్షం కురియడంతో ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. మారేడ్‌పల్లి, రాణిగంజ్‌తో సికింద్రాబాద్‌, ‌బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారం, బేంగంపేట్‌, ‌ప్యారడైజ్‌, ‌చిలుకలగూలో వర్షం కురుస్తున్నది. వర్షానికి షేక్‌పేటలో రోడ్లు జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా.. శేరిలింగంపల్లి జోన్‌ ‌పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎం‌సీ, ఈవీడీఎం డైరెక్టర్‌ ‌ట్వీట్‌ ‌చేసింది. వర్షం హెచ్చరికల నేపథ్యంలో డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు అప్రమత్తమై రంగంలోకి దిగాయని పేర్కొంది. హైదరాబాద్‌లో వర్షాలపై మేయర్‌ ‌సవి•క్ష నిర్వహించారు.

జోనల్‌ ‌కమిషనర్లతో ఫోన్‌ ‌కాన్ఫరెన్స్ ‌నిర్వహించిన మేయర్‌ ‌విజయలక్ష్మి, ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఆపరేషన్స్ ‌నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల నుంచి పిర్యాదులు రాగానే వెంటనే స్పందించాలని, క్షణాల్లో స్పాట్‌కెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. యంత్రాంగమంతా 24గంటలూ అందుబాటులో ఉండాలని  మేయర్‌ ‌విజయలక్ష్మి ఆదేశించారు. ప్రజలు అత్యవసర సమస్యలుంటే కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నంబర్స్‌కు సంప్రదించాలని సూచించారు.

Leave a Reply