Take a fresh look at your lifestyle.

నీళ్ల కోసం మరో పోరు చేయాల్సిందే

మనకు ఇంత నష్టం జరుగుతున్న కృష్ణ, గోదావరి యాజమాన్య బోర్డులకు నిధులు మాత్రం అడిగిన 15 రోజుల్లో సమకూర్చాలి లేదంటే జరిమానా కట్టాలి,కానీ పెత్తనం మాత్రం ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంటుంది.ప్రాజెక్టుల పర్యవేక్షణ,నిర్వహణ తో పాటు ఆయా ప్రాజెక్టుల ప్రాంతాల్లో ఉండే భవనాలు,యంత్రాలు చివరకు చెట్టు,చేమ కూడా బోర్డుల పరిధిలోకి వెళ్తున్నాయి. నీళ్ళు వదలాలన్న, విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్న, పంటలకు అనుగుణంగా నీళ్లు సర్దుబాటు చేసుకోవాలన్న చివరకు చిన్న చీపురు పుల్ల ముట్టలన్న బోర్డు అనుమతి పొందాల్సిందే.బట్టకు సుట్టకు కాలి,అప్పో సోప్పో తెచ్చి కట్టుకున్న ప్రాజెక్టుపై ఢిల్లీ పెద్దల ఆధిపత్యమా.సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనేమో.

నిధులు,నియామకాలకోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది.స్వరాష్టం సాధించాక కోఠి ఎకరాలకు కృష్ణా,గోదావరి నీళ్లు పారించాలనే సంకల్పంతో ఒక పక్క కాళేశ్వరం,మరోపక్క పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి అవుతున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్ర జల జగడం వల్ల నీళ్ల పై అధికారం ఢిల్లీ దర్బార్‌ ‌లో బందీ కాబడింది.ఏ నీళ్ల కోసం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో తెలంగాణ సమాజం కొట్లాడిందో,స్వరాష్టంలో ఆ నీళ్ల కోసమే ఇప్పుడు ఢిల్లీ దర్బార్‌ ‌లో అటు ఢిల్లీ పెద్దలతో,ఇటు ఆంధ్రప్రదేశ్‌ ‌తో పోరాడవలసి వస్తుంది.పెద్దన్నలా పంచాయితీ పరిష్కరించమంటే విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకొని రెండు రాష్ట్రాల పై పెత్తనం చేయాలని చూస్తున్నారు ఢిల్లీ పెద్దలు.

కృష్ణ నీటి పంపకాల్లో బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ అన్యాయం చేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వమే కోర్టుకు వెళ్లింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం కృష్ణ నీటిని మూడు రాష్ట్రాల పరిధిలో కాకుండా నాలుగు రాష్ట్రాల పరిధిలో పంచాలని,68% పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు నీటి కేటాయింపులు పెంచాలని, దానికి కొత్త ట్రిబ్యునల్‌ ‌వేయాలని లేదా ఉన్న ట్రిబ్యునల్‌ ‌కు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే కేంద్రం పట్టించుకోలేదు.

చివరకు సుప్రీంకోర్టు తలుపు తడితే,వద్దోద్దు కేసు వాపసు తీసుకొండి అప్పుడు నాలుగు రాష్ట్రాల పరిధిలో నీళ్ల పంపకాలకు కొత్త ట్రిబ్యునల్‌ ‌వేయడమా లేక ఉన్న ట్రిబ్యునల్‌ ‌కు బాధ్యతలు ఇవ్వడమా తెలుస్తామన్న పెద్దలు సమయం దొరికిందని సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ నీటి కేటాయింపులు పూర్తి కాకుండానే ఉమ్మడి ప్రాజెక్టులే కాకుండా అటు ఆంధ్ర ప్రాజెక్టులు ఇటు తెలంగాణ ప్రాజెక్టులతో పాటు ఎటువంటి వివాదం లేని గోదావరి నదిపై ప్రాజెక్టులు కూడా బోర్డుల పరిధిలోకి తెచ్చారు.కృష్ణ నీళ్ల పంపకం పరిష్కారం అయ్యేవరకు 2015లో ఢిల్లీ పెద్దల ముందు తాత్కాలికంగా ఒక సంవత్సరం వరకు మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే ఆ తాత్కాలిక ఒప్పందమే ఫైనల్‌ అం‌టే ఎట్లా?.ఉమ్మడి రాష్ట్రంలో న్యాయంగా రావాల్సిన నీళ్ల వాటాను కోల్పోయి,రాష్ట్ర విభజన జరిగి 7 సంవత్సరాలు గడుస్తున్న,7 సంవత్సరాలుగా మా న్యాయమైన వాటాను కోల్పోతున్న, నీళ్ల వాటాను తేల్చాల్సిన కేంద్రం తాత్కాలిక ఒప్పందం ప్రకారమే 299 టి ఎమ్‌ ‌సీ లే వాడుకోవాలని బోర్డుకు అధికారామిస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారదా? పదుల సంఖ్యలో ఉన్న అనుమతులు లేని ప్రాజెక్టులకు ఆరు నెలలలోగా అనుమతులు తెచ్చుకోవలట,లేదంటే నిర్మాణంలోఉన్న లేక నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టులో కూడా చెట్లు మొలువాల్సిందేనట.

ప్రాజెక్టులకు అనుమతి రావాలంటే నత్తతో పరుగు పందెంలో పాల్గొనట్లే.పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి,డిండి,నెట్టెంపాడు,యెస్‌ ఎల్‌ ‌బి సి,ఎలిమినేటి మాధవరెడ్డి,భక్త రామదాసు,తుమ్మిళ,మున్నేరు మొదలైన కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టుల భవిష్యత్తు, కాంతనపల్లి, తుపాకులగూడెం,ప్రాణహిత, రామప్ప-పాకాల అనుసంధానం,గూడెం,ముక్తేశ్వర్‌,‌చౌటుపల్లీ హన్మంత్‌ ‌రెడ్డి,కందుకుర్తి,దుమ్ముగూడెం మొదలైన గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల భవిషత్తు ప్రశ్నార్ధకం కానుంది.మనకు ఇంత నష్టం జరుగుతున్న కృష్ణ, గోదావరి యాజమాన్య బోర్డులకు నిధులు మాత్రం అడిగిన 15 రోజుల్లో సమకూర్చాలి లేదంటే జరిమానా కట్టాలి,కానీ పెత్తనం మాత్రం ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంటుంది.ప్రాజెక్టుల పర్యవేక్షణ,నిర్వహణ తో పాటు ఆయా ప్రాజెక్టుల ప్రాంతాల్లో ఉండే భవనాలు,యంత్రాలు చివరకు చెట్టు,చేమ కూడా బోర్డుల పరిధిలోకి వెళ్తున్నాయి. నీళ్ళు వదలాలన్న, విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్న, పంటలకు అనుగుణంగా నీళ్లు సర్దుబాటు చేసుకోవాలన్న చివరకు చిన్న చీపురు పుల్ల ముట్టలన్న బోర్డు అనుమతి పొందాల్సిందే.బట్టకు సుట్టకు కాలి,అప్పో సోప్పో తెచ్చి కట్టుకున్న ప్రాజెక్టుపై ఢిల్లీ పెద్దల ఆధిపత్యమా.సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనేమో.కేంద్రం కుట్రలను ఆంధ్ర నాయకత్వం గుర్తించకపోవడం దురదృష్టకరం.

నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది.ఆ నీళ్లే ఢిల్లీ దర్బార్లో బంది కాబడుతుంటే తెలంగాణ ప్రభుత్వం,సమాజం చూస్తూ ఎలా ఊరుకుంటుంది. తెలంగాణ సమాజం ఒక్కటై మరో నీళ్ల పోరు సాగించాలి.తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొట్లాడుతూనే ఢిల్లీ పెద్దలపై పార్లమెంటు లోపల బయట పోరు సాగించాలి. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం కోరుతున్నట్లు వెంటనే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి.నాలుగు రాష్ట్రాల పరిధిలో కృష్ణాజలాలు పంచాలి.ఉమ్మడి రాష్ట్ర వాటలో 68 శాతం నీళ్లు తెలంగాణకు కేటాయించాలి.పెన్నా పరివాహక ప్రాంతానికి కృష్ణా నీళ్లు తరలించడం ఆపాలి.కరువు జిల్లాలైన ఉమ్మడి మహబూబ్నగర్‌,ఉమ్మడి నల్లగొండ జిల్లాల దాహార్తిని తీర్చే ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. రాయలసీమ జిల్లాలు కూడా కరువు జిల్లాలే.గోదావరి కృష్ణా నదులను అనుసంధానించి అప్పుడు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలి.ఆ చొరవ చూపాల్సింది ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వాలే.
– జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్‌, 9494019270.

Leave a Reply