Take a fresh look at your lifestyle.

దేశంలో తొలి మహిళా న్యాయమూర్తి అమరేశ్వరి నేడు జస్టిస్‌ ‌కే.అమరేశ్వరి వర్ధంతి

సమాజంలో స్త్రీలకు సరైన గౌరవం, మర్యాద లభించని రోజుల్లో కొందరు మహిళలు, ముందుకు వచ్చి, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని, స్వయం కృషితో వివిధ రంగాల్లో తమ సత్తా చాటుకుని గుర్తింపు పొంది, సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. పురుషులకు తాము ఏమాత్రం తీసిపోమని ఆరోజుల్లోనే నిరూపించారు. తాము తలుచుకుంటే ఏమైనా సాధించ గలమని మహిళలు ముందుకు సాగారు. అలాంటి వారిలో జస్టిస్‌ అమరేశ్వరి ఒకరు. ఒక సాధారణ వ్యవసాయం కుటుంబంలో జన్మించిన ఆమె.. దేశంలో న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. పట్టుదల ఉంటే లక్ష్యాన్ని చేరుకోవడంలో పేదరికం, వివాహం, ఇతర అంశాలు ఏమాత్రం అడ్డురాదని నిరూపించిన ఆమె.. సాటి మహిళల్లో ఏమైనా సాధించగలమన్న చైతన్యాన్ని నింపారు. జస్టిస్‌ ‌కె. అమరేశ్వరి (కోనమనేని అమరేశ్వరి) భారత దేశంలో తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర పుటల కెక్కారు.గుంటూరు జిల్లా అప్పికట్ల గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో 1928, జులై 10 వ తేదీన జన్మించారు. 14వ ఏటనే పెళ్ళి జరిగినా భర్త ప్రోత్సాహముతో చదువు సాగించారు.ఆమె 1949 లో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి పాలిటిక్స్ అం‌డ్‌ ‌హిస్టరీలో ఎంఏ డిగ్రీని పొంది, అదే విశ్వ విద్యాలయం నుండి బిఎల్‌, ‌డిగ్రీని కూడా తీసుకున్నారు.

డి.మునికన్నయ్య ఛాంబర్స్‌లో ఆమె అప్రెంటిస్‌షిప్‌ ‌చేశారు. 1952 సంవత్సరంలో మద్రాస్‌ ‌హైకోర్టు న్యాయవాదిగా చేరారు. గుంటూ రుకు, తరువాత హైదరా బాద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు మారగా ఆమె అదే వృత్తిలో కొనసాగారు. 1960-61 మధ్య కాలంలో బార్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులుగా ఉన్నారు.అక్టోబర్‌, 1974 ‌లో అదనపు ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుండి 14-2-1977 వరకు రెండేళ్లపాటు అదనపు న్యాయమూర్తిగా పని చేశారు. భారత మహిళా న్యాయవాదుల సంఘమునకు ఉపాధ్యక్షులుగా,1975-76 మధ్యకాలంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులుగా విధులు నిర్వర్తించారు.

1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు ఏర్పాటు కాగా, ఉమ్మడి హైకోర్టు తొలి మహిళా న్యాయ మూర్తిగా జస్టిస్‌ అమరేశ్వరి 29-4-1978 న శాశ్వత న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. దేశములోనే తొలి మహిళా న్యాయమూర్తిగా పేరొందారు. పదమూడున్నర సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి 1990 సంలో సీనియర్‌ ‌గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ నుంచి గత 13 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ‌చేశారు. న్యాయ వ్యవస్థలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించిన మహిళ జస్టిస్‌ ‌కొనమనేని అమరేశ్వరి, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను అమరేశ్వరి సమర్ధించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు చట్ట పరమైన పరిణామాలు’ అన్న అంశంపై నిర్వహించిన ఒక సెమినార్లో ఆమె తన అభిప్రాయాన్ని ముక్కు సూటిగా వెల్లడించారు. ప్రభుత్వం నుంచి రాయితీలు అందుకుంటున్న ప్రైవేటు సంస్థలు సిబ్బంది నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయాలని గట్టిగా వాదించారు. మహిళలకు మార్గదర్శకురాలై, న్యాయ వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపు పొందిన జస్టిస్‌ అమరేశ్వరి 2009, జులై 25 న కొత్త ఢిల్లీలో మరణించారు.

– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply