Take a fresh look at your lifestyle.

మరో అస్తిత్వ పోరు. !

తెలంగాణ రాష్ట్ర సమస్తం
దోపిడీ మూకల కబంధహస్తం

ఏడేళ్ల పాలన ఆసాంతం
ఏక కుటుంబ పాదాక్రాంతం

స్వరాష్ట్రంలో …
ఆకలి చావులు
రైతు ఆత్మహత్యలు
నిరుద్యోగ నిట్టూర్పులు
వలస కూలీల వెతలు తప్పా
బతుకు పచ్చగా పండిందెపుడు?

అవమానాలు
అణిచివేతలు

అక్రమ నిర్బందాలు తప్పా
స్వేచ్ఛగ ఊపిరి పేల్చిందెన్నడు ?

అహం పోకడలు
ఏకఛత్రాధిపత్యాలు
ఓటు బ్యాంకు రాజకీయం తప్పా
ఆశయ దిశగా కాలు కదిపిందెపుడు?

నమ్మి గద్దెనెక్కించినందుకు
పీతిరి గద్దలెక్క పొడువబట్టిరి

జాతి సంపద కొల్లగొట్టి
మహారాజులై ఊరేగబట్టిరి

ఉద్యమకారుల మరచి
ద్రోహులకు పీఠం కట్టబెట్టబట్టిరి

స్వర్ణ తెలంగాణ నినాదమెత్తి
రాష్ట్రాన్ని వల్లకాడు జెయ్యబటైరి

ఇపుడు …
బతుకు వెతలు తీరాలంటే
గడీల పాలన అంతం కావాలంటే
తెలంగాణ సమాజం పిడికిలెత్తాల్సిందే
మరో అస్తిత్వ పోరుకు కదం తొక్కాల్సిందే

-కోడిగూటితిరుపతి, :9573929493

Leave a Reply