Take a fresh look at your lifestyle.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

  • మరింత బలపడితే వర్షాలకు ఛాన్స్
  • ‌ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
  • గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

గత మూడు రోజులగా రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే మళ్లీ ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో వి•టర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి 48 గంటలలో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాల్లోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. అధికారులు 17 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్‌ ‌ఫ్లో 2 లక్షల 18 వేల 135 క్యూసెక్కులు, ఔట్‌ ‌ఫ్లో లక్షా 71 వేల 830 క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీలు నిల్వ చేశారు. నిర్మల్‌ ‌జిల్లా కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఇన్‌ ‌ఫ్లో 2 వేల 214 క్యూసెక్కులుగా ఉంది. ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని మత్తడి వాగు ప్రాజెక్టు, సాత్నాల ప్రాజెక్టులు కూడా నిండిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద అధికారులు 77 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌ ఇన్‌ ‌ప్లో, ఔట్‌ ‌ప్లో 7,43,350 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 5.327 టీఎంసీలుగా ఉంది. మరొవైపు..అన్నారం (సరస్వతి) బ్యారేజీ 60 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. అన్నారం ఇన్‌ ‌ఫ్లో 1,69,472 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ ‌ఫ్లో 1,99,126గా క్యూసెక్కులుగా కొనసాగుతుంది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.28 టీఎంసీలుగా ఉంది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా జూరాల ప్రాజెక్ట్ ‌వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 11 ‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్ట్ ఇన్‌ ‌ఫ్లో 78,000 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఎ•-‌లో 81,887 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.5 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 318.3 అడుగులు ఉంది.

Leave a Reply