Take a fresh look at your lifestyle.

‌కోరలు చాస్తున్న కొరోనా మహారాష్ట్రలో మరొకరు మృతి

  • మూడుకు చేరిన మృతులు..
  • తక్షణ చర్యలకు రంగంలోకి దిగిన కేంద్రం
  • రాష్ట్రంలో మరొకరికి పాజిటివ్‌

భారత్‌లో కరోనా వైరస్‌ ‌విజృంభిస్తోంది. కరోనా వైరస్‌తో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, తాజాగా మంగళవారం మరొకరు చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్ర ముంబయిలో 64 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యులు నిర్దారించారు. కరోనా లక్షణాలతో ఈ వృద్ధుడు కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహారాష్ట్రలో మొత్తం 36 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక కలబురాగికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీకి చెందిన 68 ఏళ్ల మహిళ.. కరోనా వైరస్‌తో గతవారం మృతి చెందిన విషయం విదితమే. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు కావడంతో ఆ
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సీఎం ఉద్ధవ్‌ ‌థాకరే ఉన్నతాధికారులతో సక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ‌విధించారు. సినిమా హాల్స్, ‌షాపింగ్‌ ‌మాల్స్‌ను మూసివేశారు. అన్ని ఎన్నికలను కూడా వాయిదా వేశారు.

దేశ వ్యాప్తంగా 126 కేసులు.. 13 మంది డిశ్చార్జ్:
‌దేశంలో కరోనా కేసుల సంఖ్య 126కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం ప్రకటించింది. ఇందులో 104 మంది ఇండియన్స్ ‌కాగా.. 22 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారని పేర్కొంది. కరోనాతో చికిత్స పొందుతూ కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు, ఢిల్లీలో 69 ఏళ్ల మహిళ, మహారాష్ట్రలో 64 ఏళ్ల వ్యక్తి మరణించగా.. దేశ వ్యాప్తంగా 13 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 15 రాష్టాల్రకు కరోనా వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 39 మంది వైరస్‌ ‌బారినపడ్డారు. కేరళలో 24 మందికి కరోనా సోకింది. అందులో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. హర్యానాలో ఇప్పటి వరకు 14 మంది విదేశీయులు మాత్రమే కరోనా పేషెంట్లు చికిత్స పొందుతుండగా.. మంగళవారం ఉదయం తొలి లోకల్‌ ‌కేసు నమోదైంది. తెలంగాణలో నలుగురు వైరస్‌ ‌బారినపడ్డారు. తొలి పేషెంట్‌ ‌డిశ్చార్జ్ ‌కాగా.. మిగిలిన ముగ్గురు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక కరోనా కేసు నమోదైంది.

- Advertisement -

రాష్ట్రంలో మరో వ్యక్తికి పాజిటివ్‌:
‌రాష్ట్రంలో మరొకరికి కరోనా వైరస్‌ ‌సోకింది. మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఐదు రోజుల కింద స్కాట్లాండ్‌ ‌దేశానికి వెళ్లొచ్చిన హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి (46) కి వైరస్‌ ‌పాజిటివ్‌గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆయనకు గాంధీ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ అం‌దిస్తున్నామని తెలిపింది. ఆ వ్యక్తి స్కాట్లాండ్‌ ‌నుండి వచ్చిన మరుసటి రోజే జ్వరం రావడంతో.. నేరుగా గాంధీ హాస్పిటల్‌లో చేరాడని వెల్లడించింది. బాధితుడితో కాంటాక్ట్ అయిన 11 మందిని గుర్తించామని, వారికి టెస్టులు చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన నాలుగు కరోనా కేసుల్లో ఇప్పటికే ఒకరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగతా ముగ్గురు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఓ బాధితురాలి తండ్రికి వైరస్‌ ‌నెగిటివ్‌ ‌వచ్చిందని అధికారులు తెలిపారు.

ఆమెతో కాంటాక్ట్ అయిన 28 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. నెదర్లాండ్స్ ‌నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వ్యక్తితో 13 మంది కాంటాక్ట్ అయినట్టు గుర్తించి న అధికారులు.. వారిని కూడా క్వారంటైన్‌ ‌చేశారు. ఇదిలావుంటే కరోనాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కరోనా పై తప్పుడు సమాచారాన్ని సోషల్‌ ‌డియాలో పంపిన భువనగిరి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

వాట్స్ అప్‌ ‌గ్రూప్‌లో ఇద్దరు వ్యక్తులు కరోనాపై అసత్‌ ‌ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు ఆ ఇద్దరితోపాటు, ఆ గ్రూప్‌ అడ్మిన్‌పై కూడా కేస్‌ ‌నమోదు చేశారు. అరెస్టయిన వారిపేర్లు భరత్‌కుమార్‌, ‌శివకుమార్‌, ‌బాలు అని పోలీసు అధికారులు వెల్లడించారు. చేతిలో సెల్‌ ‌ఫోన్‌ ఉం‌దికదాని ఏదిపడితే ఎడాపెడా రాసేసి నలుగురికీ పంపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతకుముందే సోమవారం హైదరాబాద్‌లోని చైతన్యపురిలో కరోనా వదంతులపై వాట్సాప్‌లో ఫేక్‌ ‌మెసేజీలు పంపినవారిపై పోలీసులు కేసుపెట్టారు.

Leave a Reply