Take a fresh look at your lifestyle.

నియంత్రిత పంటలపై మరోమారు సిఎం సమీక్ష

21న కలెక్టర్లు , అధికారులతో చర్చకు రంగం సిద్ధ్దం

వ్యవసాయరంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్న తరుణంలో సిఎం కెసిఆర్‌ ‌స్పీడ్‌ ‌పెంచారు. రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై ఈ నెల 21న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు హాజరు కానున్నారు. జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే అంశాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికితోడు జిల్లాల వారీగా పంటల నివేదికతో అధికారులు హాజరై చర్చించనున్నారు. వ్యవసాయ, వర్సిటీ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి రెండురోజులపాటు సక్ష నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలని అనే అంశంపై మంత్రి చర్చించనున్నారు. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ, ఎంత వేయాలి? అనే అంశాలను ఖరారు చేయనున్నారు.

జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను అధికారులు రూపొందించనున్నారు. ఈ పంటల మ్యాప్‌పై సీఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. 20 లక్షల ఎకరాల్లో పత్తి, వరి 40 లక్షల ఎకరాల్లో(తెలంగాణ సోనా 10 లక్షల ఎకరాలు), కంది 15 లక్షల ఎకరాల్లో, కూరగాయలు 2 లక్షల ఎకరాల్లో, పసుపు 1.20 లక్షల ఎకరాల్లో, మిర్చి 2 లక్షల ఎకరాల్లో, సోయాబీన్‌ 3 ‌లక్షల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. యాసంగిలో మాత్రమే మక్కలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!