Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా మరో 9 కరోనా కేసులు

  • 534కు చేరుకున్న పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య
  • కడప జిల్లాలో కోలుకున్న 13మంది డిశ్చార్జ్

ఆం‌ధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 534 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో.. కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 20 మంది డిశ్చార్జ్ ‌కాగా, 14 మంది మఅతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 500 కరోనా యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరులో 122, కర్నూలులో 113 కరోనా పాటిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

ఇకపోతే కడప జిల్లాలో 13 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ ‌రిపోర్ట్ ‌రావడంతో వారిని డిశ్చార్జ్ ‌చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో 17 రోజులుగా కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందిన వీరు గురువారం డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 13 మందికి డిప్యూటీ సీఎం అంజాద్‌ ‌బాషా పౌష్టికాహార సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంజాద్‌ ‌బాషాతోపాటు జిల్లా కలెక్టర్‌ ‌హరి కిరణ్‌, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్‌ ‌సురేష్‌ ‌బాబు పాల్గొన్నారు. చికిత్స అనంతరం 13 మంది కరోనా బాధితులు కరోనా నెగిటివ్‌ ‌రిపోర్ట్ ‌రావడంపై అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు జిల్లాలో 36 కరోనా కేసులు నమోదుకాగా.. నేడు 13 మంది డిశ్చార్జ్ ‌కావడంతో యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 23కు తగ్గింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply