Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా మరో 82 కొరోనా కేసులు

  • 31కి చేరిన మృతుల సంఖ్య
  • నరసరరావుపేటలో 48 గంటల లాక్‌డౌన్‌
‌విజయవాడ,ఏప్రిల్‌ 28 : ఆం‌ధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 5,783 మందికి పరీక్షలు నిర్వహించగా 82 మందికి కరోనా నిర్దారణ అయింది. రాష్ట్రంలో.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 258 డిశ్చార్జి కాగా, 31 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 970 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో..అనంతపురం జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 17, వైఎస్సార్‌ ‌జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 13, కర్నూలు జిల్లాలో 40, నెల్లూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే  గుంటూరు జిల్లా కలెక్టర్‌ ‌శామ్యూల్‌ ఆనంద కుమార్‌ ‌నరసరావుపేటలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా అక్కడ 48 గంటల పూర్తిస్థాయి లాక్‌ ‌డౌన్‌ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. బుధ,గురువారాల్లో ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్‌ ‌మంగళవారం తెలిపారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలంతా సహకరించాలన్నారు. ఇకపోతే ’ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొంతమంది నిబంధనలు ఉల్లంఘి స్తున్నారు. అత్యవసరమైనవి తప్ప మరెలాంటి కేసులు చూడటానికి వీల్లేదు. క్వారంటైన్‌ ‌సెంటర్లలో మంచి ఆహారం అందిస్తున్నాం. ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ ‌కూడా ఇస్తున్నాం. అనుమానిత లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. లాక్‌ ‌డౌన్‌ ఉల్లంఘించినవారిని జైలుకు పంపుతున్నాం అని శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ‌పేర్కొన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా గడిచిని 24 గంటల్లో కొత్తగా మరో 17కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 254కు చేరింది. 8 మంది మృతి చెందారు.

Leave a Reply