Take a fresh look at your lifestyle.

ఎపిలో మరో 75 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు

  • హెల్త్ ‌బులిటెన్‌లో వివరించిన ఆరోగ్యశాఖ
  • కర్నూలులో ఆగని కేసుల సంఖ్య
  • టెలిమెడిసిన్‌కు అనూహ్య స్పందన

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ఎక్కువవుతుండటంతో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజుకు రెండంకెల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం గమనార్హం. సోమవారం మధ్యాహ్నం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కేసులపై బులెటిన్‌ ‌విడుదల చేసింది. గత 24 గంటల్లో జరిగిన కరోనా పరీక్షల్లో 75 కొత్త పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యా యని బులెటిన్‌లో ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ రేంజ్‌లో కేసులు నమోవ్వడంతో జనాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ 75 కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 722. ఇందులో 92 మంది డిశ్చార్జ్ ‌కాగా.. 20 మంది మృతి చెందారు. కాగా..ప్రస్తుతం చికిత్స పొందు తున్నవారి సంఖ్య 610. కర్నూలు జిల్లా 174 కేసులతో టాప్‌లో ఉండగా.. 149 కేసులతో గుంటూరు తర్వాతి స్థానంలో ఉంది. ఇదిలావు ంటే లాక్‌డౌన్‌,‌ప్రజా రవాణా స్తంభించిన నేపథ్య ంలో ప్రజలకు ఫోన్‌ ‌ద్వారానే వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వైఎస్‌ఆర్‌ ‌టెలీ మెడిసిన్‌ ‌విధానానికి అపూ ర్వ స్పందన లభిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్‌ ‌సెంటర్‌ ‌నెంబర్‌ 14410‌కు గడిచిన నాలుగు రోజుల్లో 8,243 మంది ఫోన్‌ ‌చేశారు. వీరిలో 4,732 మందికి వైద్యులు ఫోన్‌ ‌లోనే తగిన సూచనలు, అవసరమైన మందుల సమాచారం ఇచ్చారు.

- Advertisement -

మరో 3491 మందికి వైఎస్‌ఆర్‌ ‌టెలీ మెడిసిన్‌ ‌ప్రతినిధులు తిరిగి కాల్‌ ‌చేయగా వారు స్పందించలేదు.14410 నెంబ ర్‌కు ఫోన్‌ ‌చేస్తే డాక్టర్లు ఫోన్‌ ‌ద్వారానే సలహాలు ఇవ్వడంతో పాటు అవసరమైన మందుల వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారమి స్తున్నారు. అక్కడ్నుంచి మందులు పేషెంటు ఇంటికే సరఫరా చేస్తారు.ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 14410కు మిస్డ్ ‌కాల్‌ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత కాల్‌సెం టర్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌ ‌తిరిగి మనకు కాల్‌ ‌చేస్తారు. మన వివరాలు నమోదు చేసుకుని సమస్య ను తెలుసుకుని సంబంధిత డాక్టరుకు కనెక్ట్ ‌చేస్తా రు.డాక్టరు మన సమస్యలు విన్నాక మందులు అవసరమను కుంటే సంబంధిత మెడికల్‌ ఆఫీసర్‌ ‌కు సూచిస్తారు. ఆ తర్వాత పేషెంటు ఇంటికే మందులు తీసుకొచ్చి ఇస్తారు. మనం మిస్డ్ ‌కాల్‌ ఇవ్వగానే తిరిగి ఎగ్జిక్యూటివ్‌ ‌చేస్తారు.. కాల్‌ ‌బిజీ వచ్చినా, స్విచ్‌ఆఫ్‌ ‌వచ్చినా రెండోసారి చేస్తారు. రెండోసారి ఫోన్‌ ‌చేసినా సమాధానం ఇవ్వక పోతే మళ్లీ కాల్‌ ‌రాదు.మళ్లీ కొత్తగా మిస్డ్ ‌కాల్‌ ఇవ్వాలి. ప్రస్తుతం టెలీ మెడిసిన్‌ ‌కోసం వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యులు 286 మంది వాలంటరీగా వచ్చి రిజిస్టర్‌ ‌చేసుకుని పనిచేస్తున్నారు.

Leave a Reply