Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొరోనాతో మరో 53మంది మృత్యువాత

తెలంగాణలో కొరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొరోనా విజృంభణకు మరో 53మంది బలయ్యారు. సెకండ్‌వేవ్‌ ఉధృతి కారణంగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 7 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,646 మందికి కొరోనా సోకినట్టు నిర్దారణ అయింది. అలాగే కొరోనా కారణంగా 53 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకూ 4,35,606 కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 2,261కు చేరుకుంది.

తెలంగాణలో ప్రస్తుతం 77,727 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ ‌బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా 5వేల 926 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. గురువారం ఒకే రోజు 77వేల 091 పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 77వేల 727 యాక్టివ్‌ ‌కేసులున్నాయి.నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎం‌సీలో 1,441 కేసులున్నాయి. ఆ తర్వాత మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరిలో 631, రంగారెడ్డిలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్‌లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, మహబూబ్‌నగర్‌లో 243, జగిత్యాలలో 230 కేసులు బయటపడ్డాయి.

Leave a Reply