Take a fresh look at your lifestyle.

ఎపిలో మరో 48 కొరోనా కేసులు

అమరావతి,మే 13 : ఆంధ్రప్రదేశ్‌ ‌లో కరోనా వైరస్‌ ‌చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9,284 శాంపిళ్లను పరీక్షించగా అందులో 48 కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్‌ ‌కేసులు సంఖ్య 2,137కి చేరింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ ‌మహమ్మారిలో 47మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 948 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. 1,142 మంది బాధితులు కోవిడ్‌ ‌తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో కొత్తగా అనంతపురం- 3, చిత్తూరు-11, తూర్పు గోదావరి-4, గుంటూరు-12, కృష్ణా-3, కర్నూలు-7 చొప్పున కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 591 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 8 మందికి కరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయినట్టు ఆంధ్రప్రదేశ్‌ ‌వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కరోనాతో కర్నూలు జిల్లా నుంచి ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 47కు చేరింది. ఇకపోతే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఏపీలో క్రమంగా పెరుగుతుంది. యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య కంటే డిశ్చార్జి కేసుల సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 86 మంది డిశ్చార్జ్ ‌కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1142కి చేరింది. డిశ్చార్జి అయిన వారిలో గుంటూరు 27, కృష్ణా 25 , కర్నూలు 13, కడప 10, తూర్పు గోదావరి 4, పశ్చిమ గోదావరి 4, అనంపురం, నెల్లూరు, శ్రీకాకుళం నుంచి ఒక్కొక్కరు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 948 కరోనా యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి.

Leave a Reply