Take a fresh look at your lifestyle.

ఎపిలో మరో 443 మందికి పాజిటివ్‌

  • ‌తాజాగా మరో ఐదుగురు మృతి ఆందోళనలో ప్రజానీకం

అమరావతి,జూన్‌ 22 : ‌కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ ‌లో విలయతాండవం చేస్తుంది..మొత్తం ద కరోనా మహమ్మారి రాష్ట్రంలోని నలుమూలలకు వ్యాప్తి చెందుతోంది. ఏరోజుకారోజు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతోంది. గత 24 గంటల్లో 443 మంది వైరస్‌ ‌బారిన పడినట్లు నిర్దారణ అయింది. తాజాగా ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో 9,372కు కరోనా కేసులు చేరాయి. స్థానికంగా ఉంటున్న 392 మందికి కరోనా సోకింది. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ ‌లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు. ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. కాగా, గత 24 గంటల వ్యవధిలో 443 మందికి కరోనా పాజిటివ్‌ ‌గా నిర్దారణ అయింది.51 కేసులు ఇతర రాష్ట్రా నుంచి,విదేశాల నుంచి వచ్చిన వారివిగా గుర్తించారు. మొత్త్మద ఏపీలో ఇప్పటివరకు 9,372 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి.

తాజాగా 83 మంది డిశ్చార్జి కాగా, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,435కి పెరిగింది. ప్రస్తుతం 4,826 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.కొత్తగా మరో 5 మరణాలు సంభవి ంచడంతో కరోనా మృతుల సంఖ్య 111కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఒకరు,కర్నూలు జిల్లాలో ఒకరు,అనంతపూర్‌ ‌జిల్లాలో ఒకరు,పశ్చిమ గోదా వరి జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. లాక్‌డౌన్‌ ఆం‌క్షల సడలింపు తర్వాత కరోనా వైరస్‌ ‌విజృంభిస్తోంది. జనాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. అన్ని దుకాణాలు తెరవడం, ప్రజలు తమ అవసరాల కోసం రోడ్లపైకి రావడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇతర దేశాలు, రాష్ట్రాలనుంచి వచ్చేవారితో కూడా రాష్ట్రంలో వైరస్‌ ‌వ్యాప్తి జరుగుతోంది.విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లోని ఓ రెవెన్యూ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో కలెక్టరేట్‌లో రాకపోకలపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించారు. ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో పలువురు సహచర ఉద్యోగులు హోం క్వారంటైన్‌కు వెళ్లారు.

Leave a Reply