Take a fresh look at your lifestyle.

మల్లన్నసాగర్‌ ‌గోదావరి జలాలతో..

కొమురవెల్లి మల్లన్నకు అభిషేకం.. సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక పూజలు
ప్రజాతంత్ర, సిద్దిపేట, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్‌ ‌ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మల్లన్నసాగర్‌ ‌గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్ట్‌ను బుధవారం మధ్యాహ్నం జాతికి అంకితం చేసిన అనంతరం సిఎం కెసిఆర్‌ ‌మల్లన్నను దర్శించుకున్నారు. సీఎం వెంట మంత్రి హరీష్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ‌ప్రతాప్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave a Reply