Take a fresh look at your lifestyle.

బాలాలయంలో నారసింహునికి చక్రతీర్థ స్నానం

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ప్రజాతంత్ర, యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో లక్ష్మీనారసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలాలయంలోనే మహా పూర్ణాహుతి, చక్రస్నానాన్ని అర్చకులు నిర్వహించారు. సాయంత్రం శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి కల్యాణ లక్ష్మీనరసింహులు భక్తజనులకు రథరూపులుగా దర్శనమిచ్చారు. లోక కల్యాణంకోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో దివ్య విమాన రథోత్సవాన్ని ఆగమనియమాలకు అనుగుణంగా బాలాలయ ఉత్సవ మండపంలో నిర్వహించారు.

వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రథానికి దిష్టికుంభం తీశారు. పట్టువస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన నూతన కల్యాణ దంపతులైన లక్ష్మీ, నారసింహులను బాలాలయ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై అధిష్ఠించారు. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగహోమం నిర్వహించారు. అదే విధంగా వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి ఆకుల తోరణాలతో స్వామివారి దివ్య విమానరథాన్ని అలంకరించి, పట్టణ పురవీధుల్లో ఊరేగించారు.

Leave a Reply