Take a fresh look at your lifestyle.

అన్నదాత..

మట్టిని ముద్దడాలంటేనే భయమేస్తుంది..
అంకురాల ఆశకు చెదలు పట్టినయేమో..
చట్టాల చుట్టాలు కామాంధుల హస్తమై
కన్నీళ్లు కారుస్తోందీప్పుడు..
తొలకరి చిగురులు తొడగక..మేఘాల చాటున
భయం గుప్పిట్లో దాక్కుంటుంది..
ఎక్కడ సంకెళ్ళు వేసి నడిబజార్‌ ‌లో
నిలబెడతారేమోనని?

రేపటి రోజు తినే ముద్ద కూడ..
అధికారం చేతిలో ఆటబొమ్మయి..
బతుకు తెరువు కు శాపం గా మారి
మర మనిషిగా రూపాంతరం చెంది..
మేకుల సూదులు గుండెల్లో
గుచ్చుకొని విలవిల లాడుతదేమో!

ఆపన్న హస్తాల చుట్టూ తిరిగి తిరిగి
అలసిన ఎదలకు ఓదార్పు నిస్తున్నా
ఉద్యమాల సూర్య చంద్రులను
అణిచివేసే పాషాణం చేష్టలకు
భరతమాత హృదయం ద్రవించి
ఘనిభవిస్తుందీప్పుడు..
ఇంకా మాయమాటలతో, రాజకీయ
శుష్కవేదాంతం తో,కల్లీబొల్లి కబుర్లలతో..
రాబోవు తరాలను చీకట్లోకి నెట్టి
వర్తమానం కు గాయాలతో చికిత్స చేస్తూ
చావుకి దారులు పరుస్తున్నారు

ప్రజాస్వామ్యపు స్వేచ్చ రెక్కలు
పురివిప్పాలంటే.., భగత్‌ ‌సింగ్‌ ‌పోరాటం
స్ఫూర్తిగా నింపుకొని, నల్లదొరల విషపు
కొరల్ని పీకి, రైతునోట్లో మట్టికొట్టే
పెత్తన్దారి వ్యవస్థ ను భూస్థాపితం చెయ్యడానికి
అన్నదాతకు అండగా నిలబడదాం
మట్టి కళ్ళలో మెరిసే పచ్చని పైరుల సొగస్సులు
తనవితీరా ముద్దడుదాం!

-రవీందర్‌ ‌కొండ,9848408612,హైదరాబాద్‌

Leave a Reply