కరీమాబాద్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సిఓగా పని చేస్తున్న నల్ల విజయలక్ష్మి వేధింపులకు గురి చేసి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వైద్యాధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి ఎదుట ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎంజిఎంలో చికిత్స పొందుతున్న సీఓను పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న అప్పటికి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అకారణంగా వేధింపులకు గురి చేస్తున్న వైద్యాధికారి పై చర్య తీసుకోవాలని, నల్ల విజయలక్ష్మి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికారులు వేధింపులు చేయడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురవుతున్నామని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఆశా కార్యకర్తలు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.