హైదరాబాద్,ఆగస్ట్ 31: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు కు చెందిన అడ్వకేట్ అంకాల పృథ్వీరాజ్ మరియు అంబేద్కర్ పూలే సంఘం, హైదరాబాద్ కు చెందిన గాయకుడు సంపత్ అనే కార్యకర్తను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వద్ద తెలంగాణ రాష్ట్రపోలీసులు ఆగస్ట్ 27 శుక్ర వారం, మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారని మానవ హక్కుల వేదిక కు సమాచారం అందినట్లు మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.నాలుగు రోజులు గడుస్తున్న కూడా వాళ్ల సమాచారం పోలీసులు బహిరంగ పర్చడం లేదనీ..అరెస్ట్ ల విషయంలో తెలంగాణ పోలీసులు, సుప్రీం కోర్టుసూచించిన మార్గ దర్శ కాల కు భిన్నంగా అసాంఘిక శక్తుల లాగా పౌరులను బలవంతం గా ఎత్తుక పోతున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
పారదర్శకం గా వ్వ్యవహరించ కుండా ఒక రౌడీ గ్యాంగ్ లాగా,చట్ట వ్యతిరేకం గా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ.. పోలీసుల ఈ చట్ట వ్యతిరేక ధోరణి నీ తీవ్రం గా ఖండిస్తుందని తెలిపారు.కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా పెట్టుకున్న న్యాయవాది అంకాల పృధ్వీరాజ్,గాయకుడు సంపత్ ను వెంటనే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టాలని,లేక వదిలివేయాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకమిటీ సభ్యుడు ఎస్.జీవన్ కుమార్,రాష్ట్ర అధ్యక్షుడు జీ. మాధవ రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. తిరుపతి డిమాండ్ చేసారు.