Take a fresh look at your lifestyle.

పథకాలు అర్హులందించేందుకు కృషి: యాదాద్రి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

‌ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ‌తెలిపారు. సోమవారం ఆలిండియా సర్వీసుల ట్రైనింగ్‌ అధికారుల బృం దం గ్రూపు లీడర్‌ ఆర్తివర్మ నేతృత్వంలో పోచంపల్లి జలాల్‌పూర్‌ ‌గ్రామంలో ఈనెల 16 నుండి 21 వరకు విలేజ్‌ ‌విసిట్‌ ‌నిర్వహించి ప్రభుత్వ పథకాలపై అవగాహన చెందనున్నారు. ఈ నేపథ్యంలో పోచంపల్లి మండలం జలాల్‌పూ ర్‌లోని శ్రీ రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్లో జిల్లా కలెక్టర్‌ను ఆల్‌ ఇం‌డియా సర్వీసుల అధికారుల బృందం కలిసి ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలైన హరితహారం, కెసిఆర్‌ ‌కిట్స్, ‌భూ రికార్డుల శుద్ధీకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ‌రైతు బీమా, సాగు, తాగు నీటి ప్రాజెక్టులు తదితర పథకాల అమలు తీరును కలెక్టర్‌ అధికారుల బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ అధికారులు భూక్య లావణ్య, మధురిమ, భట్టచార్య, శోభదేవి, తోపాటు హార్టికల్చర్‌ అధికారి సురేష్‌, ఎస్‌ఆర్‌టిఐ డైరెక్టర్‌ ‌కిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Greenhouse, KCR Kits, Zoo Records, Kalyanalakshmi, Shadimubarak, Raithu Insurance, Cultivation, Drinking Water Projects

Leave a Reply

error: Content is protected !!