సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పిలుపు
అంగన్వాడీలు తమ హక్కు సాధనకు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగాలని, పోరాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర 10 వ మహాసభలు శుక్ర, శనివారాల్లో గుంటూరు నగరంలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి రోజు ప్రారంభ సభలో యూనియన్ జాతీయ కార్యదర్శి కె.వరలక్ష్మి, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింగరావు, ఎంఎ.గఫూర్, ఐద్వా ఆలిండియా ట్రెజరర్ పుణ్యవతిలు పాల్గొని ప్రసంగించారు.
రెండో రోజు శనివారం సభల ముగింపు సందర్భంగా … నగరంలో ర్యాలీ నిర్వహించారు. మహాసభలో ప్రధానంగా కనీస వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హాల అమలు, ఐసిడిఎస్ వ్యవస్థ పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణపై చర్చించి, కర్తవ్యాలు నిర్దేశిరచనున్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ.గఫూర్ మాట్లాడుతూ … అంగన్వాడీలు తమ హక్కు సాధనకు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగాలని, పోరాడాలని కోరారు.