Take a fresh look at your lifestyle.

ఆం‌ధ్రప్రదేశ్‌కు చల్లని కబురు

  • తెలుగునేలను పలకరించిన నైరుతి
  • అల్పపీడనంతో కోస్తాంధ్రలో
  • అక్కడక్కడ భారీ వర్షాలు

అమరావతి,జూన్‌ 11 : ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ ‌కన్నబాబు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో బలపడనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో చెదురు మదురుగా తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణశాఖ ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేసింది. తీరంవెంబడి గంటకు 40-50 కి. వేగంతో గాలులు వీస్తాయని సముద్రం అలజడిగా ఉంటుందని, కావున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని కమిషనర్‌ ‌కన్నబాబు సూచించారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రానున్న మూడు రోజులు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, చెరువుల వద్ద, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇదిలావుంటే తూర్పు మధ్య బంగాళాఖాతం దుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటిలోగా మరింత అల్పపీడనం బలపడను ందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో మరింత చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. రెంటింటి ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కి వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గురు,శుక్రవారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Leave a Reply