Take a fresh look at your lifestyle.

ఆం‌ధప్రదేశ్‌లో వర్షాలు, ఎండలతో భిన్నంగా వాతావరణం

పలుచోట్ల అకాల వర్షాలు
ఆం‌ధప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా పలు చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఓపక్క ఎండలు మండుతుంటే.. మరోపక్క ఈ వర్షాలు పడటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. అయితే, కర్నూలు, అనంతపురం, కడప, విశాఖ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం ఎపిలో పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పలుచోట్ల మమిడి పంటలకు దెబ్బ తగిలింది. కాపుకు వస్తున్న సమయంలో ఈ భారీ వర్షంతో పండ్లు నేలరాలాయి. హైదరాబాద్‌లోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలుచోట్ల వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

Leave a Reply